వీపనగండ్లలో గద్దర్ విగ్రహ ఏర్పాటుకు సన్నాహాలు.

వలస శంకర్ గౌడ్ జిల్లా సాహితి కళావేదిక అధ్యక్షులు.

వీపనగండ్లలో గద్దర్ విగ్రహ ఏర్పాటుకు సన్నాహాలు.

వనపర్తి,నవంబర్15(తెలంగాణ ముచ్చట్లు):

ప్రజా గాయకుడు, ప్రజా యుద్ధనౌక గద్దర్ విగ్రహాన్ని వీపనగండ్ల మండల కేంద్రంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించడం అభినందనీయమని సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ అన్నారు. నవంబర్ 19, గురువారం గద్దర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న నేపథ్యంలో వనపర్తి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో విగ్రహ ఆవిష్కరణ పోస్టర్‌ను వివిధ ప్రజా సంఘాల నాయకులతో కలిసి విడుదల చేశారు.ఈ సందర్భంగా పలుస శంకర్ గౌడ్ మాట్లాడుతూ.. పేదల గొంతుకగా, అణగారిన వర్గాల ఆశాజ్యోతిగా గద్దర్ తన జీవితాంతం పాటల ద్వారా ప్రజలను చైతన్యపరిచారని అన్నారు. తెలంగాణ ఉద్యమంతో పాటు అనేక ప్రజా ఉద్యమాల్లో ఆయన పాటలు ప్రజల్లో పోరాట స్ఫూర్తిని నింపాయని పేర్కొన్నారు. విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి జిల్లా ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఎతం కృష్ణయ్య మాట్లాడుతూ డప్పు కొట్టి, పాట పాడి ప్రజల్లో చైతన్యం నింపిన గొప్ప ప్రజా కళాకారుడు గద్దర్ అని కొనియాడారు. డీటీఎఫ్ నాయకుడు యోసేఫ్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో గద్దర్ పాటలు వేలాది మందిని కదిలించాయని అన్నారు. డప్పు స్వామి మాట్లాడుతూ గద్దర్ అంటే ఒక పేరు మాత్రమే కాదని, ఒక ఉద్యమమని, ఒక చరిత్ర అని పేర్కొన్నారు.గంధం నాగరాజు మాట్లాడుతూ గద్దర్ విగ్రహ ఏర్పాటు ద్వారా భావితరాలకు ఆయన ఆశయాలు, పోరాట స్ఫూర్తి అందుతాయని అన్నారు. బండారు శ్రీనివాస్ యువత గద్దర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. నిరంజనయ్య మాట్లాడుతూ వీపనగండ్ల ప్రజలంతా ఐక్యంగా విగ్రహ ఏర్పాటుకు కృషి చేయడం అభినందనీయమని తెలిపారు. గద్దర్‌కు ఇది నిజమైన నివాళి అని వక్తలు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉద్యమ నాయకులు ఎతం కృష్ణయ్య, జైభీమ్ సేవా సంఘం అధ్యక్షుడు బండారు శ్రీనివాస్, ఎడ్డుల యాదగిరి, అగ్గి రాములు, కళ్యాణ్, నరసింహ, చెన్నకేశవులు, చినరాములు, గోపాలకృష్ణ, డప్పు స్వామి, గంధం నాగరాజు, పెరుమల శ్రీనివాస్, కురుమూర్తి, గద్దర్ విగ్రహ నిర్మాణ కమిటీ సభ్యులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు, కళాకారులు, ప్రజలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News