నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి చిన్నారెడ్డి.
Views: 0
On
పెద్దమందడి,నవంబర్15(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మోజర్ల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు దాసరి మల్లయ్య, చిన్న నాగమ్మ దంపతుల కుమారుడు వినోద్ కుమార్ వివాహ వేడుకకు మాజీ మంత్రి డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్, లోకేశ్వరి నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపి అక్షింతలు వేసి ఆశీర్వదించారు.ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ నూతన వధూవరుల వైవాహిక జీవితం ప్రేమానురాగాలు, ఆనందం, సుఖసంతోషాలతో నిండాలని ఆకాంక్షించారు. దంపతులు జీవితాంతం పరస్పర అవగాహనతో, అన్యోన్యంగా జీవించాలని ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ మన్నెం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గట్టు దయాకర్, సతీష్ యాదవ్, రమేష్ యాదవ్, మల్లేష్ యాదవ్, రామ్ నరేష్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Nov 2026 20:32:36
* అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు.. ప్రజా ప్రభుత్వ లక్ష్యం* గత పాలకులు పింఛన్లు, రేషన్ కార్డులను, పేదోడి గూటిని పట్టించుకోలేదు* కాళేశ్వరం పేరుతో.. కమీషన్ల...


Comments