కిలో మటన్‌కు పావు కిలో కొవ్వు ఇస్తారా?
కిలోకు రూ.800 చెల్లించినా నాణ్యమైన మటన్ అందించరా?
-- వినియోగదారుడు నక్కల భాస్కర్ ఆవేదన
పెద్దమందడి,నవంబర్15(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామంలో మటన్ కొనుగోలుపై వినియోగదారుడు నక్కల భాస్కర్ ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో ఓ మటన్ షాప్ దగ్గర కిలో మటన్‌కు రూ.800 చెల్లించి కొనుగోలు చేసినప్పటికీ, మాంసం తక్కువగా వేసి పావు కిలో వరకు కొవ్వు కలిపి ఇచ్చారని ఆరోపించారు.అధిక ధరలు చెల్లించి మటన్ కొనుగోలు చేస్తున్న వినియోగదారులకు నాణ్యమైన మాంసం అందించాల్సిన బాధ్యత వ్యాపారులపై ఉందన్నారు. మటన్ పేరుతో కొవ్వు ఎక్కువగా ఇవ్వడం వల్ల వినియోగదారులు నష్టపోతున్నారని పేర్కొన్నారు.కిలోకు రూ.800 వసూలు చేస్తున్నప్పుడు మాంసం తగ్గించి కొవ్వు ఎక్కువగా ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మటన్ వ్యాపారులు వినియోగదారుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సరైన తూకంతో నాణ్యమైన మాంసాన్ని అందించాలని నక్కల భాస్కర్ కోరారు.


Comments