బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు.
కర్రతో దాడికి యత్నించినట్లు బాధితురాలి ఫిర్యాదు.
Views: 0
On
వేలేరు, నవంబర్ 16 (తెలంగాణ ముచ్చట్లు):
వేలేరు గ్రామంలో మహిళను అసభ్య పదజాలంతో దూషించి, బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిపై వేలేరు పోలీసులు కేసు నమోదు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వేలేరు గ్రామానికి చెందిన పుట్టా రోజా (30) ఈ నెల 14వ తేదీ సాయంత్రం తన మొక్కజొన్న పంటను ఆరబెట్టిన ప్రదేశం వద్దకు ఆవులు రావడంతో వాటిని నిలువరించాలని కేకలు వేసింది. దీంతో ఆవులను అక్కడి నుంచి తోలుకెళ్లారు.
ఈ విషయాన్ని మనసులో పెట్టుకున్న ఆమె బావ పుట్టా తిరుపతి (33) అదే రోజు సాయంత్రం రోజాను అసభ్యకరమైన పదజాలంతో దూషిస్తూ, అవమానకరమైన వ్యాఖ్యలు చేశాడని, అంతేకాకుండా బెదిరింపులకు పాల్పడి కర్రతో కొట్టేందుకు ప్రయత్నించాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు వేలేరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి విచారణ చేపట్టారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
16 Nov 2026 20:33:22
*కరీంనగర్‌లో 3,812 మందికి కొత్తగా చేయూత పెన్షన్లు మంజూరు.*
*66 డివిజన్ల పరిధిలో లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ.*
*వృద్ధులకు కూడా పెన్షన్లు మంజూరు చేయాలి –...


Comments