దీక్షా దివస్‌ స్ఫూర్తి సభకు చొప్పదండి నుంచి వేలాదిగా తరలిరావాలి.

దీక్షా దివస్‌ స్ఫూర్తి సభకు చొప్పదండి నుంచి వేలాదిగా తరలిరావాలి.

*ఈ నెల 29న అలుగునూరులో సభ.*

*దీక్షా దివస్‌తో తెలంగాణ ప్రజలను ఏకం చేసిన వ్యక్తి కేసీఆర్.*

*ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌:మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్.*

చొప్పదండి, నవంబర్ 16(తెలంగాణ ముచ్చట్లు):

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు గుర్తుగా ఈ నెల 29న నిర్వహించనున్న దీక్షా దివస్‌ స్ఫూర్తి సభను విజయవంతం చేయాలని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పిలుపునిచ్చారు.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ఈ నెల 29న కరీంనగర్ జిల్లా అలుగునూరులో నిర్వహించే దీక్షా దివస్‌ స్ఫూర్తి సభకు చొప్పదండి నియోజకవర్గం నుంచి వేలాదిగా ప్రజలను తరలించడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని సూచించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్నట్లు తెలిపారు.

ఈ మేరకు గంగాధర మండలం బూరుగుపల్లిలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు, ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించి సభ విజయవంతానికి చేపట్టాల్సిన కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

పేదల జీవితాల్లో ‘చేయూత’ వెలుగులు.. కొత్త పెన్షన్ల మంజూరు. పేదల జీవితాల్లో ‘చేయూత’ వెలుగులు.. కొత్త పెన్షన్ల మంజూరు.
*కరీంనగర్‌లో 3,812 మందికి కొత్తగా చేయూత పెన్షన్లు మంజూరు.* *66 డివిజన్ల పరిధిలో లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ.* *వృద్ధులకు కూడా పెన్షన్లు మంజూరు చేయాలి –...
ఢిల్లీ జాతీయ స్థాయి ఉపాధ్యాయ శిక్షణకు ఎంపికైన టి. సూర్యకుమారి.
ఏఎస్సై గా ఉద్యోగన్నతి పొందిన పోలీస్ అధికారులను అభినందించిన సీపీ.
త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించి రికార్డులు తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్.
భక్తిశ్రద్ధలతో ఘనంగా ఛఠ్ పూజ వేడుకలు.
బెజ్జంకిలో ఘనంగా నూతన చేయూత పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ.
బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు.