ఢిల్లీ జాతీయ స్థాయి ఉపాధ్యాయ శిక్షణకు ఎంపికైన టి. సూర్యకుమారి.

ఢిల్లీ జాతీయ స్థాయి ఉపాధ్యాయ శిక్షణకు ఎంపికైన టి. సూర్యకుమారి.

ఖమ్మం బ్యూరో, నవంబర్ 16(తెలంగాణ ముచ్చట్లు )

ఢిల్లీలో నిర్వహించనున్న జాతీయ స్థాయి ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమానికి ఖమ్మం జిల్లాకు చెందిన ఉపాధ్యాయురాలు టి. సూర్యకుమారి ఎంపిక కావడం పట్ల విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తూ ఆమెకు అభినందనలు తెలిపారు. ఖమ్మం జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, శాంతినగర్ సముదాయ పరిధిలోని కొత్తగూడెం ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తూ, ప్రస్తుతం సంభానీనగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రతినియామకంపై విధులు నిర్వహిస్తున్న ఎస్.జి.టి. ఉపాధ్యాయురాలు టి. సూర్యకుమారి ఈ శిక్షణకు ఎంపికయ్యారు. భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సాంస్కృతిక వనరులు, శిక్షణ కేంద్రం నిర్వహించనున్న ఈ జాతీయ స్థాయి శిక్షణ కార్యక్రమం 2026 నవంబర్ 18 నుంచి డిసెంబర్ 3వ తేదీ వరకు న్యూఢిల్లీలో జరగనుంది. జాతీయ విద్యా విధానం-2020కు అనుగుణంగా విద్యాబోధనలో తోలుబొమ్మలాట పాత్ర అనే అంశంపై ఈ శిక్షణ నిర్వహించనున్నారు. విద్యాబోధనలో తోలుబొమ్మలాట వంటి సృజనాత్మక కళారూపాలను అనుసంధానం చేయడం ద్వారా విద్యార్థుల్లో నేర్చుకోవాలనే ఆసక్తి, సృజనాత్మకత, భావవ్యక్తీకరణ సామర్థ్యాలు పెంపొందుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ శిక్షణ ద్వారా నూతన బోధనా పద్ధతులను నేర్చుకొని పాఠశాల స్థాయిలో అమలు చేయడం ద్వారా విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్య అందించేందుకు అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా అర్బన్ మండల విద్యాశాఖాధికారి శైలజాలక్ష్మి, సముదాయ ప్రధానోపాధ్యాయులు చల్లగాని కృపాబాలానందం, సంభానీనగర్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గురిజాల గౌరి, ఉపాధ్యాయులు పర్వీన్, ఉషా, కె. మీనా తదితరులు టి. సూర్యకుమారికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకొని భవిష్యత్తులో మరిన్ని ఉన్నత స్థాయి గుర్తింపులు సాధించాలని ఆకాంక్షించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

పేదల జీవితాల్లో ‘చేయూత’ వెలుగులు.. కొత్త పెన్షన్ల మంజూరు. పేదల జీవితాల్లో ‘చేయూత’ వెలుగులు.. కొత్త పెన్షన్ల మంజూరు.
*కరీంనగర్‌లో 3,812 మందికి కొత్తగా చేయూత పెన్షన్లు మంజూరు.* *66 డివిజన్ల పరిధిలో లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ.* *వృద్ధులకు కూడా పెన్షన్లు మంజూరు చేయాలి –...
ఢిల్లీ జాతీయ స్థాయి ఉపాధ్యాయ శిక్షణకు ఎంపికైన టి. సూర్యకుమారి.
ఏఎస్సై గా ఉద్యోగన్నతి పొందిన పోలీస్ అధికారులను అభినందించిన సీపీ.
త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించి రికార్డులు తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్.
భక్తిశ్రద్ధలతో ఘనంగా ఛఠ్ పూజ వేడుకలు.
బెజ్జంకిలో ఘనంగా నూతన చేయూత పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ.
బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు.