పేదలకు ఉచిత కంటి వైద్య సేవలు అందించడం అభినందనీయం.

పలుస శంకర్ గౌడ్, జిల్లా సాహితీ కళావేదిక అధ్యక్షులు.

పేదలకు ఉచిత కంటి వైద్య సేవలు అందించడం అభినందనీయం.

వనపర్తి,నవంబర్16(తెలంగాణ ముచ్చట్లు):

కంటిచూపు సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరూ సమయానికి కంటి పరీక్షలు చేయించుకోవాలని సాహితీ కళావేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ సూచించారు.వనపర్తి పట్టణంలోని గాంధీ చౌక్‌లో ఉన్న వనితా జ్యోతి మహిళా సంఘం కార్యాలయం వద్ద లైఫ్ క్యూర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి, హైదరాబాద్ వారి సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ శిబిరానికి పలుస శంకర్ గౌడ్ హాజరై వైద్య సేవలందించిన వారిని శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి వైద్య సేవలు అందించడం అభినందనీయమని అన్నారు. డాక్టర్ ఎ.కె. ఖమర్రహమాన్ వనితా జ్యోతి మహిళా సంఘం ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతూ పేద ప్రజలకు అండగా నిలవడం ప్రశంసనీయమని కొనియాడారు.వనితా జ్యోతి మహిళా సంఘం తెలంగాణ స్వచ్ఛంద సంస్థ ముఖ్య కార్యనిర్వాహకులు డాక్టర్ ఎ.కె. ఖమర్రహమాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో సుమారు 50 మంది ఉచితంగా కంటి పరీక్షలు చేయించుకున్నారు.ఈ కార్యక్రమంలో బండారు శ్రీనివాస్, సోహెల్, చిట్టెమ్మ, రహమాన్, ఆసుపత్రి వైద్య బృందానికి చెందిన డాక్టర్ సయ్యద్ అహ్మద్ హుస్సేన్, సయ్యద్ ఫజల్ హుస్సేన్, సుహానా పర్వీన్, మహజబీన్, ఆయేషా జబీన్, స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

పేదల జీవితాల్లో ‘చేయూత’ వెలుగులు.. కొత్త పెన్షన్ల మంజూరు. పేదల జీవితాల్లో ‘చేయూత’ వెలుగులు.. కొత్త పెన్షన్ల మంజూరు.
*కరీంనగర్‌లో 3,812 మందికి కొత్తగా చేయూత పెన్షన్లు మంజూరు.* *66 డివిజన్ల పరిధిలో లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ.* *వృద్ధులకు కూడా పెన్షన్లు మంజూరు చేయాలి –...
ఢిల్లీ జాతీయ స్థాయి ఉపాధ్యాయ శిక్షణకు ఎంపికైన టి. సూర్యకుమారి.
ఏఎస్సై గా ఉద్యోగన్నతి పొందిన పోలీస్ అధికారులను అభినందించిన సీపీ.
త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించి రికార్డులు తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్.
భక్తిశ్రద్ధలతో ఘనంగా ఛఠ్ పూజ వేడుకలు.
బెజ్జంకిలో ఘనంగా నూతన చేయూత పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ.
బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు.