చిన్నారి శ్రీనిధికి ఆశీస్సులు అందించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి.

చిన్నారి శ్రీనిధికి ఆశీస్సులు అందించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి.

పెద్దమందడి,నవంబర్16(తెలంగాణ ముచ్చట్లు):

పెద్దమందడి మండల కేంద్రంలోని 7వ వార్డు సభ్యుడు కొమ్ము బ్రహ్మయ్య స్వగృహంలో నిర్వహించిన చిన్నారి శ్రీనిధి పుష్పాలంకరణ మహోత్సవ వేడుకకు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా చిన్నారి శ్రీనిధిని ఆశీర్వదించి, ఆమె తల్లిదండ్రులు కొమ్ము బ్రహ్మయ్య, కృష్ణవేణి దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. చిన్నారి శ్రీనిధి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లుతూ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమానికి ఆహ్వానించిన కుటుంబ సభ్యులను అభినందించారు.ఈ వేడుకలో గ్రామ అధ్యక్షుడు టీ సేనాపతి, గ్రామ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు పురుషోత్తం రెడ్డి, మండల అధికార ప్రతినిధి సింగిరెడ్డి కురుమూర్తి, వార్డు సభ్యురాలు సింగిరెడ్డి అమల, గొల్ల మౌగిలయ్య, గొడుగు రామచంద్రయ్య, కొమ్ము బాలనాగన్న తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

పేదల జీవితాల్లో ‘చేయూత’ వెలుగులు.. కొత్త పెన్షన్ల మంజూరు. పేదల జీవితాల్లో ‘చేయూత’ వెలుగులు.. కొత్త పెన్షన్ల మంజూరు.
*కరీంనగర్‌లో 3,812 మందికి కొత్తగా చేయూత పెన్షన్లు మంజూరు.* *66 డివిజన్ల పరిధిలో లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ.* *వృద్ధులకు కూడా పెన్షన్లు మంజూరు చేయాలి –...
ఢిల్లీ జాతీయ స్థాయి ఉపాధ్యాయ శిక్షణకు ఎంపికైన టి. సూర్యకుమారి.
ఏఎస్సై గా ఉద్యోగన్నతి పొందిన పోలీస్ అధికారులను అభినందించిన సీపీ.
త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించి రికార్డులు తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్.
భక్తిశ్రద్ధలతో ఘనంగా ఛఠ్ పూజ వేడుకలు.
బెజ్జంకిలో ఘనంగా నూతన చేయూత పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ.
బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు.