సగరులను  బీసీ-ఏలో చేర్చాలి.

జిల్లా అధ్యక్షుడు మోడల తిరుపతయ్య సాగర్.

సగరులను  బీసీ-ఏలో చేర్చాలి.

వనపర్తి,నవంబర్16( తెలంగాణ ముచ్చట్లు):

విద్యా, ఉపాధి, రాజకీయ, సామాజిక రంగాల్లో వెనుకబాటుకు గురవుతున్న సగరులను బీసీ-డీ నుంచి బీసీ-ఏలోకి మార్చాలని సగర సంఘం వనపర్తి జిల్లా అధ్యక్షుడు మోడల తిరుపతయ్య సాగర్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు వనపర్తి జిల్లా కలెక్టరేట్ వద్ద సగర సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి, బీసీ సంక్షేమ శాఖ అధికారులకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా తిరుపతయ్య సాగర్ మాట్లాడుతూ సగరులు తరతరాలుగా కులవృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని, నిర్మాణ పనులు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లి దినసరి కూలీలుగా పనిచేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారని తెలిపారు. విద్యా, ఉపాధి, ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో తీవ్ర వెనుకబాటుకు గురవుతున్నారని పేర్కొన్నారు.బీసీ-డీ విభాగంలో ఇతర కులాలతో పాటు ఉండటం వల్ల సగరులకు తగిన అవకాశాలు లభించడం లేదని అన్నారు. సగరుల వాస్తవ జీవన పరిస్థితులు, ఆర్థిక స్థితిగతులు, సామాజిక వెనుకబాటుతనంపై సమగ్ర అధ్యయనం నిర్వహించి బీసీ-ఏ విభాగంలో చేర్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.అలాగే జీవో 59ను సవరించి ప్రభుత్వ కాంట్రాక్టు పనుల్లో సగరులకు రిజర్వేషన్ శాతం పెంచాలని, సగరులను నిర్మాణ రంగ కార్మికులుగా గుర్తించి ఆరోగ్య భద్రత కార్డులు మంజూరు చేయడంతో పాటు పెన్షన్ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. సగరుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలని బీసీ సంక్షేమ శాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గొబ్బూరి చంద్రయ్య, జిల్లా కోశాధికారి గుంటి సత్యం సాగర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిలుక సత్యం సాగర్, రాష్ట్ర కోశాధికారి చీర్ల విష్ణు, గోల్డెన్ సిటీ ఆర్.కె. రవి సాగర్, మహిళా మాజీ అధ్యక్షురాలు మహేశ్వరి సాగర్, రాష్ట్ర నాయకుడు పెబ్బేరు శ్రీనివాసులు సాగర్, జిల్లా ఉపాధ్యక్షుడు నాగరాజు, జిల్లా ముఖ్య సలహాదారు పల్లె సత్యనారాయణ, వనపర్తి పట్టణ అధ్యక్షుడు బుజ్జన్న, సంస్కృత విభాగం అధ్యక్షుడు నాగేంద్రం, జిల్లా మహిళా అధ్యక్షురాలు జ్యోతి, మాజీ లీగల్ అడ్వైజర్ సుజనా సాగర్, వనపర్తి మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ చీర్ల శ్రీనివాసులు, మాజీ పట్టణ అధ్యక్షుడు పెద్దనాగులు, మరికుంట అధ్యక్షుడు నాగరాజు, సోషల్ మీడియా ఇన్‌చార్జి శ్రీనివాసులు, వివిధ మండలాల అధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారులు, సగర సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

పేదల జీవితాల్లో ‘చేయూత’ వెలుగులు.. కొత్త పెన్షన్ల మంజూరు. పేదల జీవితాల్లో ‘చేయూత’ వెలుగులు.. కొత్త పెన్షన్ల మంజూరు.
*కరీంనగర్‌లో 3,812 మందికి కొత్తగా చేయూత పెన్షన్లు మంజూరు.* *66 డివిజన్ల పరిధిలో లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ.* *వృద్ధులకు కూడా పెన్షన్లు మంజూరు చేయాలి –...
ఢిల్లీ జాతీయ స్థాయి ఉపాధ్యాయ శిక్షణకు ఎంపికైన టి. సూర్యకుమారి.
ఏఎస్సై గా ఉద్యోగన్నతి పొందిన పోలీస్ అధికారులను అభినందించిన సీపీ.
త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించి రికార్డులు తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్.
భక్తిశ్రద్ధలతో ఘనంగా ఛఠ్ పూజ వేడుకలు.
బెజ్జంకిలో ఘనంగా నూతన చేయూత పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ.
బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు.