ప్రేమ శిఖరాలు"""

ప్రేమ శిఖరాలు

"""ప్రేమ శిఖరాలు"""

జీవితంలో నువ్వు కొని కట్టుకున్న కొత్త వస్త్రాలకంటే
నా చదువుల అప్పుకు కట్టిన వడ్డీ పొట్లాలే ఎక్కువ నాన్న

ఆప్తుడు ఇచ్చే అప్పుకోసం
అర్ధాకలితో  కంచంలో కడిగేసిన నీ చెయ్యి 
పరుగు పెట్టిన నీ కాళ్ళకు నే చేసే వందనం ఏ దేవుడి సాష్టాంగ నమస్కారానికి సమానం నాన్న

ప్రక్కటెముకలు పిక్కటిల్లే పురిటినొప్పుల సాహసం 
నా తొలి అడుగు కోసం తపించి  వెదకిన నీ కనుల చల్లని చూపు

తప్పటడుగులో తల్లడిల్లి అన్ని వైపుల అండగా నిలిచిన నీ అభయహస్తం
ఏ దేవత ప్రదక్షిణల నుండి పొందగలను అమ్మ

తప్పుడడుగులో క్షమించి సరిచేసిన షరతులు లేని మీ ప్రేమ 
నా అనారోగ్యంలో అలసిపోక ఆదరించిన మీ దయకు
భువిపై  ఏ దేవీ దేవతలు కొలువుండే  శిఖరాలు సమానం కాగలవు అమ్మా నాన్న.

నా తల్లి తండ్రులు నేపా బేబీ సత్యనారాయణ గారికి అందరి తల్లి తండ్రులకు ప్రేమతో.....

నేపా సంతోష్ అచ్యుత్ కుమార్ అసిస్టెంట్ ప్రొఫెసర్, కాళోజీ ప్రతిభా పురస్కార గ్రహీత.8639442397.

Tags:

Post Your Comments

Comments

Latest News

పేదల జీవితాల్లో ‘చేయూత’ వెలుగులు.. కొత్త పెన్షన్ల మంజూరు. పేదల జీవితాల్లో ‘చేయూత’ వెలుగులు.. కొత్త పెన్షన్ల మంజూరు.
*కరీంనగర్‌లో 3,812 మందికి కొత్తగా చేయూత పెన్షన్లు మంజూరు.* *66 డివిజన్ల పరిధిలో లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ.* *వృద్ధులకు కూడా పెన్షన్లు మంజూరు చేయాలి –...
ఢిల్లీ జాతీయ స్థాయి ఉపాధ్యాయ శిక్షణకు ఎంపికైన టి. సూర్యకుమారి.
ఏఎస్సై గా ఉద్యోగన్నతి పొందిన పోలీస్ అధికారులను అభినందించిన సీపీ.
త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించి రికార్డులు తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్.
భక్తిశ్రద్ధలతో ఘనంగా ఛఠ్ పూజ వేడుకలు.
బెజ్జంకిలో ఘనంగా నూతన చేయూత పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ.
బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు.