మండలంలో 577 మందికి నూతన చేయూత పెన్షన్లు.

ఎమ్మెల్యే చేతుల మీదుగా పెన్షన్ మంజూరు పత్రాలు పంపిణీ.

మండలంలో 577 మందికి నూతన చేయూత పెన్షన్లు.

పెద్దమందడి,నవంబర్16(తెలంగాణ ముచ్చట్లు):

తెలంగాణ ప్రభుత్వం సామాజిక భద్రత, ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో అమలు చేస్తున్న చేయూత పింఛన్ల పథకంలో భాగంగా వనపర్తి జిల్లా పెద్దమందడి మండలానికి కొత్తగా 577 పెన్షన్లు మంజూరయ్యాయి. ఆర్థికంగా వెనుకబడిన నిరుపేద కుటుంబాలు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, చేనేత కార్మికులకు ప్రభుత్వం ఈ పెన్షన్లను మంజూరు చేసింది.నూతనంగా పెన్షన్లు మంజూరైన లబ్ధిదారులకు ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమాన్ని నవంబర్ 17వ తేదీ మంగళవారం సాయంత్రం 4 గంటలకు పెద్దమందడిలోని చెన్నకేశవ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమానికి వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, తన చేతుల మీదుగా లబ్ధిదారులకు నూతన చేయూత పెన్షన్ మంజూరు ఉత్తర్వులను అందజేయనున్నారని పెద్దమందడి ఎంపీడీవో సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి పెద్దమందడి మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల సర్పంచులు, మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, ప్రజాప్రతినిధులు, పత్రికా ప్రతినిధులు, నూతన పెన్షన్ లబ్ధిదారులు హాజరుకావాలని  ఎంపీడీవో కోరారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

పేదల జీవితాల్లో ‘చేయూత’ వెలుగులు.. కొత్త పెన్షన్ల మంజూరు. పేదల జీవితాల్లో ‘చేయూత’ వెలుగులు.. కొత్త పెన్షన్ల మంజూరు.
*కరీంనగర్‌లో 3,812 మందికి కొత్తగా చేయూత పెన్షన్లు మంజూరు.* *66 డివిజన్ల పరిధిలో లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ.* *వృద్ధులకు కూడా పెన్షన్లు మంజూరు చేయాలి –...
ఢిల్లీ జాతీయ స్థాయి ఉపాధ్యాయ శిక్షణకు ఎంపికైన టి. సూర్యకుమారి.
ఏఎస్సై గా ఉద్యోగన్నతి పొందిన పోలీస్ అధికారులను అభినందించిన సీపీ.
త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించి రికార్డులు తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్.
భక్తిశ్రద్ధలతో ఘనంగా ఛఠ్ పూజ వేడుకలు.
బెజ్జంకిలో ఘనంగా నూతన చేయూత పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ.
బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు.