గ్రామ రహదారి సమస్యపై ప్రజావాణిలో సర్పంచ్ ఫిర్యాదు.

గ్రామ రహదారి సమస్యపై ప్రజావాణిలో సర్పంచ్ ఫిర్యాదు.

వనపర్తి,నవంబర్16(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా  పెద్దమందడి మండలం మద్దిగట్ల గ్రామంలో నెలకొన్న రహదారి సమస్యను పరిష్కరించాలని కోరుతూ గ్రామ సర్పంచ్ మేకల రాములు యాదవ్, ఉప సర్పంచ్ రవి సాగర్ సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.గ్రామంలోని పంట పొలాలకు, అక్కడి నుంచి పెద్దమందడి ప్రధాన రహదారికి వెళ్లే దారిలో ఓ రైతు అడ్డంకులు సృష్టిస్తూ రహదారి మరమ్మతు పనులకు ఆటంకం కలిగిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. గత 70 సంవత్సరాలుగా గ్రామస్థులు, బాటసారులు వినియోగిస్తున్న ఈ దారిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాకపోకలు సాగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.రహదారి సమస్యను పరిష్కరించి మరమ్మతు పనులు చేపట్టేందుకు గ్రామస్థుల అభ్యర్థన మేరకు సంబంధిత అధికారులు సహకరించాలని జిల్లా అధికారులను విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన అధికారులు మండల స్థాయి అధికారులకు విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సర్పంచ్, ఉప సర్పంచ్ మండల స్థాయి అధికారులకు మరోసారి అర్జీ సమర్పించారు.ఇదిలా ఉండగా, అదే సమస్యపై సంబంధిత రైతు సైతం ప్రజావాణిలో తన వాదనను అధికారుల ముందు వినిపించారు. ఇరువర్గాల వాదనలు విన్న అధికారులు గ్రామస్థాయిలో విచారణ చేపట్టి వాస్తవ పరిస్థితులపై నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విచారణ నివేదిక ఆధారంగా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

పేదల జీవితాల్లో ‘చేయూత’ వెలుగులు.. కొత్త పెన్షన్ల మంజూరు. పేదల జీవితాల్లో ‘చేయూత’ వెలుగులు.. కొత్త పెన్షన్ల మంజూరు.
*కరీంనగర్‌లో 3,812 మందికి కొత్తగా చేయూత పెన్షన్లు మంజూరు.* *66 డివిజన్ల పరిధిలో లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ.* *వృద్ధులకు కూడా పెన్షన్లు మంజూరు చేయాలి –...
ఢిల్లీ జాతీయ స్థాయి ఉపాధ్యాయ శిక్షణకు ఎంపికైన టి. సూర్యకుమారి.
ఏఎస్సై గా ఉద్యోగన్నతి పొందిన పోలీస్ అధికారులను అభినందించిన సీపీ.
త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించి రికార్డులు తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్.
భక్తిశ్రద్ధలతో ఘనంగా ఛఠ్ పూజ వేడుకలు.
బెజ్జంకిలో ఘనంగా నూతన చేయూత పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ.
బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు.