బెజ్జంకిలో ఘనంగా నూతన చేయూత పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ.
*అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలతో లబ్ధి చేకూరాలి – ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ.*
మానకొండూర్, నవంబర్ 16(తెలంగాణ ముచ్చట్లు):
మానకొండూర్ నియోజకవర్గం బెజ్జంకి మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘం ఫంక్షన్ హాల్‌లో నూతనంగా మంజూరైన చేయూత పెన్షన్ పత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మానకొండూర్ నియోజకవర్గ శాసనసభ్యులు, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డా. కవ్వంపల్లి సత్యనారాయణ, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యతో కలిసి మండలంలోని అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు పత్రాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా డా. కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ద్వారా పేద ప్రజలకు ప్రయోజనం చేకూరాలని ఆకాంక్షించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నామని, ఇలాంటి సంక్షేమ పథకాలు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండేలా కృషి చేస్తామని తెలిపారు.
నూతనంగా మంజూరైన చేయూత పెన్షన్ పత్రాలను అందుకున్న లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బెజ్జంకి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులు, స్థానిక నాయకులు, సహకార సంఘం బాధ్యులు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.


Comments