ప్రజలు ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలి.

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ బాలయ్య..

ప్రజలు ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలి.

పెద్దమందడి,నవంబర్16(తెలంగాణ ముచ్చట్లు):

ప్రతి ఒక్కరికీ న్యాయం అందించాలనే లక్ష్యంతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సేవలు అందిస్తున్నామని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ ఎ. బాలయ్య సూచించారు.వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం గట్ల ఖానాపూర్ గ్రామంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సోమవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఒక మారుమూల గ్రామాన్ని ఎంపిక చేసి 60 రోజుల పాటు ప్రత్యేక న్యాయ సేవా కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో భాగంగా గట్ల ఖానాపూర్ గ్రామంలో ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహించి, అర్హులైన లబ్ధిదారులను గుర్తించనున్నట్లు పేర్కొన్నారు. పెన్షన్లు, లేబర్ కార్డులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందని అర్హులైన వారికి అవసరమైన న్యాయపరమైన సహాయం అందించనున్నట్లు వివరించారు.గ్రామస్థుల సౌకర్యార్థం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద లీగల్ ఎయిడ్ క్లినిక్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎలాంటి న్యాయపరమైన సమస్యలు ఉన్నా ఉచిత న్యాయ సహాయం కోసం నల్సా హెల్ప్‌లైన్ నంబర్ 15100ను సంప్రదించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డిప్యూటీ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ డి. కృష్ణయ్య, మండల తహసీల్దార్ మల్లికార్జున్, పంచాయతీ కార్యదర్శి శరత్ చంద్ర, గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, పారా లీగల్ వాలంటీర్లు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

పేదల జీవితాల్లో ‘చేయూత’ వెలుగులు.. కొత్త పెన్షన్ల మంజూరు. పేదల జీవితాల్లో ‘చేయూత’ వెలుగులు.. కొత్త పెన్షన్ల మంజూరు.
*కరీంనగర్‌లో 3,812 మందికి కొత్తగా చేయూత పెన్షన్లు మంజూరు.* *66 డివిజన్ల పరిధిలో లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ.* *వృద్ధులకు కూడా పెన్షన్లు మంజూరు చేయాలి –...
ఢిల్లీ జాతీయ స్థాయి ఉపాధ్యాయ శిక్షణకు ఎంపికైన టి. సూర్యకుమారి.
ఏఎస్సై గా ఉద్యోగన్నతి పొందిన పోలీస్ అధికారులను అభినందించిన సీపీ.
త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించి రికార్డులు తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్.
భక్తిశ్రద్ధలతో ఘనంగా ఛఠ్ పూజ వేడుకలు.
బెజ్జంకిలో ఘనంగా నూతన చేయూత పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ.
బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు.