వెల్టూర్ కు సింగిల్ విండో మంజూరు కావడం హర్షణీయం.
కాంగ్రెస్ ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థి విభాగం సభ్యుడు నాగార్జున.
వనపర్తి,నవంబర్18(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి నియోజకవర్గానికి నాలుగు నూతన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (సింగిల్ విండోలు) మంజూరు కావడం హర్షణీయమని కాంగ్రెస్ ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థి విభాగం సభ్యుడు నాగార్జున అన్నారు. ముఖ్యంగా వెల్టూర్ గ్రామానికి నూతన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మంజూరు కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రత్యేక చొరవతో రేవల్లి, ఏదుల, సోలిపూర్, వెల్టూర్ గ్రామాలకు నాలుగు నూతన సింగిల్ విండోల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్యే చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు.వెల్టూర్ గ్రామంలో సింగిల్ విండో ఏర్పాటు కావడంతో ఆ ప్రాంత రైతులకు వ్యవసాయ రుణాలు, ఎరువులు, విత్తనాలు తదితర సహకార సేవలు మరింత చేరువ కానున్నాయని తెలిపారు. రైతులు వ్యవసాయ అవసరాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన ఇబ్బందులు తగ్గి, స్థానికంగానే సహకార సేవలు పొందే అవకాశం కలుగుతుందని అన్నారు.నూతన సింగిల్ విండోల ఏర్పాటుకు సహకరించిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డికి నాగార్జున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.


Comments