బాధిత కుటుంబానికి మేఘన్న అభయహస్తం ద్వారా ఆర్థిక సాయం.

బాధిత కుటుంబానికి మేఘన్న అభయహస్తం ద్వారా ఆర్థిక సాయం.

పెద్దమందడి,నవంబర్18(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మద్దిగట్ల గ్రామానికి చెందిన వాకిటి బాలమణి ఆకస్మికంగా మృతి చెందడంతో వారి కుటుంబానికి వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఆధ్వర్యంలోని మేఘన్న అభయహస్తం ద్వారా రూ.5,000 ఆర్థిక సహాయం అందజేశారు.ఆపద సమయంలో బాధిత కుటుంబానికి అండగా నిలిచి ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కి కుటుంబ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రాములు యాదవ్ మాట్లాడుతూ బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు.ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు ఆర్థిక చేయూత అందిస్తూ మానవతా దృక్పథంతో ముందుకు సాగుతున్న మేఘన్న అభయహస్తం కార్యక్రమంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాములు యాదవ్, ఉప సర్పంచ్ రవి సాగర్, మాజీ సర్పంచ్ పి. నారాయణ, జల్లి నరసింహ, గడ్డమీది రాజు, ఆర్. వెంకటేష్ గౌడ్, ఎం. కృష్ణయ్య, నరసింహ చారి, జె. నాగేష్ యాదవ్, ఎస్. రవి, వి. యాదన్న, జి. వెంకటేష్, జి. రాజు, ఎం. శివరాం, ఎం. రాములు, పి. బాలకృష్ణ, వెంకటేష్, వార్డు సభ్యుడు బాలకృష్ణ గౌడ్, జి. మొగులయ్య, మద్దిగట్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

నిరుపేదలకు దుప్పట్ల పంపిణీకి వాసవి చిరు వ్యాపార సంఘం ఏర్పాట్లు. నిరుపేదలకు దుప్పట్ల పంపిణీకి వాసవి చిరు వ్యాపార సంఘం ఏర్పాట్లు.
ఖమ్మం బ్యూరో, నవంబర్ 18(తెలంగాణ ముచ్చట్లు ) నిరుపేదలకు చేయూతనందించే లక్ష్యంతో వాసవి చిరు వ్యాపార సంఘం ఆధ్వర్యంలో త్వరలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ...
పామిరెడ్డిపల్లిలో 37 మందికి చేయూత పింఛన్ల మంజూరు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి.
సింగిల్ విండో పీఠాలపై 'రెడ్డి'ల గురి!
బాధిత కుటుంబానికి మేఘన్న అభయహస్తం ద్వారా ఆర్థిక సాయం.
నిజాయితిగూడెంలో బీఆర్ఎస్ జెండా గద్దె కూల్చివేతపై తీవ్ర ఆగ్రహం.
27వ డివిజన్‌లో అభివృద్ధి పనులకు శ్రీకారం.