విద్యార్థులు పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోవాలి.

పలుస శంకర్ గౌడ్, రిటైర్డ్ హెడ్మాస్టర్, జిల్లా సాహితీ కళావేదిక అధ్యక్షులు.

విద్యార్థులు పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోవాలి.

వనపర్తి,నవంబర్18(తెలంగాణ ముచ్చట్లు):

విద్యార్థులు చిన్నతనం నుంచే పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోవాలని రిటైర్డ్ హెడ్మాస్టర్, జిల్లా సాహితీ కళావేదిక అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ అన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ వనపర్తి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా బుధవారం నిర్వహించిన ఉపన్యాస పోటీలను ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుస్తక పఠనం ద్వారా విద్యార్థుల్లో విజ్ఞానం, ఆలోచనా శక్తి, సృజనాత్మకత పెంపొందుతాయని తెలిపారు. పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా వివిధ రంగాలకు సంబంధించిన పుస్తకాలను చదవడం ద్వారా సమాజంపై అవగాహన పెరుగుతుందని పేర్కొన్నారు. పుస్తకాలు మనిషికి మంచి జ్ఞానాన్ని అందించడంతో పాటు వ్యక్తిత్వ వికాసానికి దోహదపడతాయని అన్నారు. విద్యార్థులు ప్రతిరోజూ కొంత సమయాన్ని పుస్తక పఠనానికి కేటాయించాలని సూచించారు.ఈ ఉపన్యాస పోటీలకు న్యాయనిర్ణేతలుగా రిటైర్డ్ ఉపాధ్యాయులు సత్తార్, రిటైర్డ్ హెడ్మాస్టర్ నరేందర్ వ్యవహరించారు. వనపర్తి పట్టణంలోని వివిధ పాఠశాలలకు చెందిన 60 మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో లైబ్రేరియన్ శ్రీనివాసులు, గ్రంథాలయ సిబ్బంది రమ్య, చైతన్య, జ్యోతి, వెంకటేశ్వరమ్మ, చెన్నయ్య, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

నిరుపేదలకు దుప్పట్ల పంపిణీకి వాసవి చిరు వ్యాపార సంఘం ఏర్పాట్లు. నిరుపేదలకు దుప్పట్ల పంపిణీకి వాసవి చిరు వ్యాపార సంఘం ఏర్పాట్లు.
ఖమ్మం బ్యూరో, నవంబర్ 18(తెలంగాణ ముచ్చట్లు ) నిరుపేదలకు చేయూతనందించే లక్ష్యంతో వాసవి చిరు వ్యాపార సంఘం ఆధ్వర్యంలో త్వరలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ...
పామిరెడ్డిపల్లిలో 37 మందికి చేయూత పింఛన్ల మంజూరు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి.
సింగిల్ విండో పీఠాలపై 'రెడ్డి'ల గురి!
బాధిత కుటుంబానికి మేఘన్న అభయహస్తం ద్వారా ఆర్థిక సాయం.
నిజాయితిగూడెంలో బీఆర్ఎస్ జెండా గద్దె కూల్చివేతపై తీవ్ర ఆగ్రహం.
27వ డివిజన్‌లో అభివృద్ధి పనులకు శ్రీకారం.