విద్యార్థి ఉద్యమానికి కొత్త ఊపు.. గోపాలపూర్‌లో ఎంఎస్ఎఫ్ నూతన కమిటీ ఎన్నిక!
ఎల్కతుర్తి నవంబర్ 18 (తెలంగాణ ముచ్చట్లు):
ఎల్కతుర్తి మండలం గోపాలపూర్ గ్రామంలో మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ (ఎంఎస్ఎఫ్) గ్రామ నూతన కమిటీని ఎన్నుకున్నారు. విద్యార్థుల హక్కుల పరిరక్షణ, విద్యారంగంలో సామాజిక చైతన్యం పెంపొందించడం లక్ష్యంగా నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా గ్రామ అధ్యక్షుడిగా మారపెల్లి పవన్ కళ్యాణ్ మాదిగ, ఉపాధ్యక్షుడిగా మాడుగుల సాయికిరణ్ మాదిగ, ప్రధాన కార్యదర్శిగా సందేలా ప్రణీత్ మాదిగ, కార్యదర్శిగా పోగుల అరుణ్ మాదిగ, కోశాధికారిగా జూపాక వరుణ్ సందేశ్ మాదిగ ఎన్నికయ్యారు.
అదేవిధంగా కార్యవర్గ సభ్యులుగా యెల్తూరి సాక్షిత్ మాదిగ, జూపాక కిరణ్ కుమార్ మాదిగ, కొయ్యడ ప్రవీణ్ మాదిగ ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. విద్యార్థుల హక్కుల కోసం పోరాడుతూ, విద్యార్థుల్లో ఐక్యత, సామాజిక చైతన్యం పెంపొందించేందుకు ముందుంటామని పేర్కొన్నారు. ఎంఎస్ఎఫ్ సంఘం బలోపేతానికి, విద్యార్థుల అభ్యున్నతికి సమిష్టిగా కృషి చేస్తామని తెలిపారు.


Comments