వెల్టూర్ గ్రామానికి 85 నూతన పింఛన్లు మంజూరు.

లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి.

వెల్టూర్ గ్రామానికి 85 నూతన పింఛన్లు మంజూరు.

పెద్దమందడి,నవంబర్17(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామానికి 85 నూతన చేయూత పింఛన్లు మంజూరయ్యాయి. ఈ సందర్భంగా పెద్దమందడి మండల కేంద్రంలోని శ్రీ చెన్నకేశవ స్వామి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమంలో వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి లబ్ధిదారులకు పింఛన్ల మంజూరు పత్రాలను అందజేశారు.ఎన్నో రోజులుగా పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులకు పింఛన్లు మంజూరు కావడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ పింఛన్లు పేద కుటుంబాలకు ఆర్థిక భరోసాగా నిలుస్తాయని పేర్కొన్నారు.అర్హులైన ప్రతి ఒక్కరికీ పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ నవనీత క్యామరాజ్, ఉపాధ్యక్షులు వెంకటేశ్వర రెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, బాలచంద్రయ్య, గ్రామ అధ్యక్షుడు ప్రేమ్ సాగర్, సి వెంకటయ్య, రవీందర్, వడ్డె శేఖర్, వార్డు సభ్యులు నాగభూషణ్, మద్దూర్ వెంకటయ్య, దయ్యాల శేఖర్, దయ్యాల అంజన్న, మిల్లర్ రాజు, నవీన్, బజార్ వెంకటేష్, సాదిక్, పాముల నాగార్జున్, ఇరికి చెట్టి మోహన్, ఎంపీడీవో పరిణత, పంచాయతీ కార్యదర్శి వెంకటస్వామి, జిపిఓ వెంకటయ్య గౌడ్, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

పార్టీలకతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తాం. పార్టీలకతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తాం.
ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటా.. ప్రతి ఒక్కరికీ అండగా ఉంటా – వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పెద్దమందడి,నవంబర్17(తెలంగాణ ముచ్చట్లు): ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, తనను...
వెల్టూర్ గ్రామానికి 85 నూతన పింఛన్లు మంజూరు.
పేదల జీవితాల్లో ‘చేయూత’ వెలుగులు.. కొత్త పెన్షన్ల మంజూరు.
ఢిల్లీ జాతీయ స్థాయి ఉపాధ్యాయ శిక్షణకు ఎంపికైన టి. సూర్యకుమారి.
ఏఎస్సై గా ఉద్యోగన్నతి పొందిన పోలీస్ అధికారులను అభినందించిన సీపీ.
త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించి రికార్డులు తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్.
భక్తిశ్రద్ధలతో ఘనంగా ఛఠ్ పూజ వేడుకలు.