81 మందికి ఆసరా.. పింఛన్ల మంజూరుపై పాలాభిషేకం!

ఎమ్మెల్యే కడియం శ్రీహరి చొరవతో పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా.

81 మందికి ఆసరా.. పింఛన్ల మంజూరుపై పాలాభిషేకం!

వేలేరు, నవంబర్ 18 (తెలంగాణ ముచ్చట్లు):

వేలేరు మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో 81 నూతన ఆసరా పింఛన్లు మంజూరు కావడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వేలేరు మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి చిత్రపటాలకు సర్పంచ్ బిల్లా యాదగిరి, లబ్ధిదారులు పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా సర్పంచ్ బిల్లా యాదగిరి మాట్లాడుతూ.. కొత్త పింఛన్ల మంజూరుతో నిరుపేదలకు ఆర్థిక భరోసా లభిస్తుందని అన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రత్యేక చొరవతో వేలేరు మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో 81 నూతన ఆసరా పింఛన్లు మంజూరయ్యాయని తెలిపారు. లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేసినట్లు పేర్కొన్నారు. మరో 20 పింఛన్ల దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఎమ్మెల్యే సహకారంతో పింఛన్ అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
నూతన పింఛన్లు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క, ఎమ్మెల్యే కడియం శ్రీహరికి సర్పంచ్‌తో పాటు లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ శ్రీకర్, గ్రామపంచాయతీ కార్యదర్శి విజయ, సర్పంచులు శ్రీనివాస్, రాజు, అరుణ నాగరాజు, వార్డు సభ్యులు ప్రశాంత్, పర్వీన్, లక్ష్మీనారాయణ, చైతన్య, సురేష్, సునీల్, పెద్ద సంఖ్యలో పింఛన్ లబ్ధిదారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.IMG-20261118-WA0020

Tags:

Post Your Comments

Comments

Latest News

నిరుపేదలకు దుప్పట్ల పంపిణీకి వాసవి చిరు వ్యాపార సంఘం ఏర్పాట్లు. నిరుపేదలకు దుప్పట్ల పంపిణీకి వాసవి చిరు వ్యాపార సంఘం ఏర్పాట్లు.
ఖమ్మం బ్యూరో, నవంబర్ 18(తెలంగాణ ముచ్చట్లు ) నిరుపేదలకు చేయూతనందించే లక్ష్యంతో వాసవి చిరు వ్యాపార సంఘం ఆధ్వర్యంలో త్వరలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ...
పామిరెడ్డిపల్లిలో 37 మందికి చేయూత పింఛన్ల మంజూరు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి.
సింగిల్ విండో పీఠాలపై 'రెడ్డి'ల గురి!
బాధిత కుటుంబానికి మేఘన్న అభయహస్తం ద్వారా ఆర్థిక సాయం.
నిజాయితిగూడెంలో బీఆర్ఎస్ జెండా గద్దె కూల్చివేతపై తీవ్ర ఆగ్రహం.
27వ డివిజన్‌లో అభివృద్ధి పనులకు శ్రీకారం.