అర్హులైన ప్రతి ఒక్కరికీ రాజకీయాలకు అతీతంగా చేయూత పింఛన్లు.

అర్హులైన ప్రతి ఒక్కరికీ రాజకీయాలకు అతీతంగా చేయూత పింఛన్లు.

భీమదేవరపల్లి మండలంలో కొత్తగా 837 పింఛన్లు మంజూరు

హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత – మంత్రి పొన్నం ప్రభాకర్

భీమదేవరపల్లి, నవంబర్ 18 (తెలంగాణ ముచ్చట్లు):

అర్హులైన ప్రతి ఒక్కరికీ రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ చేయూత పింఛన్లు అందజేస్తామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి, హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌లో నూతనంగా మంజూరైన చేయూత పింఛన్ల మంజూరు పత్రాలను బుధవారం లబ్ధిదారులకు అందజేశారు.

IMG-20261118-WA0024

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భీమదేవరపల్లి మండలంలో కొత్తగా 837 చేయూత పింఛన్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. అర్హత ఉండి గతంలో పింఛన్లు పొందలేకపోయిన వారందరికీ ఎలాంటి రాజకీయ వివక్షకు తావులేకుండా పింఛన్లు అందిస్తామని తెలిపారు.

ఆరు గ్యారెంటీల అమలుకు ప్రాధాన్యత

రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలుతో పాటు మహిళా సంక్షేమం, రైతు సంక్షేమం, విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని 173 గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు.

దివ్యాంగులకు సహాయక పరికరాల పంపిణీ

దివ్యాంగులు, వృద్ధులకు ఉచితంగా సహాయక పరికరాలు అందించేందుకు ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సాగునీటి సమస్యల పరిష్కారం, విద్యాసంస్థల ఏర్పాటు, క్రీడా ప్రాంగణాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

సంక్షేమం, అభివృద్ధి తమ ప్రభుత్వానికి రెండు కళ్ల వంటివని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

నిరుపేదలకు దుప్పట్ల పంపిణీకి వాసవి చిరు వ్యాపార సంఘం ఏర్పాట్లు. నిరుపేదలకు దుప్పట్ల పంపిణీకి వాసవి చిరు వ్యాపార సంఘం ఏర్పాట్లు.
ఖమ్మం బ్యూరో, నవంబర్ 18(తెలంగాణ ముచ్చట్లు ) నిరుపేదలకు చేయూతనందించే లక్ష్యంతో వాసవి చిరు వ్యాపార సంఘం ఆధ్వర్యంలో త్వరలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ...
పామిరెడ్డిపల్లిలో 37 మందికి చేయూత పింఛన్ల మంజూరు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి.
సింగిల్ విండో పీఠాలపై 'రెడ్డి'ల గురి!
బాధిత కుటుంబానికి మేఘన్న అభయహస్తం ద్వారా ఆర్థిక సాయం.
నిజాయితిగూడెంలో బీఆర్ఎస్ జెండా గద్దె కూల్చివేతపై తీవ్ర ఆగ్రహం.
27వ డివిజన్‌లో అభివృద్ధి పనులకు శ్రీకారం.