పామిరెడ్డిపల్లిలో 37 మందికి చేయూత పింఛన్ల మంజూరు.

సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం.

పామిరెడ్డిపల్లిలో 37 మందికి చేయూత పింఛన్ల మంజూరు.

పెద్దమందడి,నవంబర్18(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మండల కేంద్రంలో నిర్వహించిన చేయూత ఆసరా పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి చేతుల మీదుగా పామిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన 37 మంది వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు నూతన పింఛన్ల మంజూరు పత్రాలను అందజేశారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఆసరా పింఛన్లు సక్రమంగా మంజూరు కాక అనేకమంది పేదలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. ప్రజా పాలన ప్రభుత్వంలో అర్హులైన నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందుతుండటం సంతోషకరమన్నారు. తమ గ్రామానికి చెందిన 37 మందికి పింఛన్లు మంజూరు కావడానికి ప్రత్యేక చొరవ చూపిన రాష్ట్ర ముఖ్యమంత్రి  ఏనుముల రేవంత్ రెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డికి పామిరెడ్డిపల్లి గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.అదేవిధంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వైద్య ఖర్చులు భరించలేని నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన ఆర్థిక సహాయ చెక్కులను కూడా పంపిణీ చేశారు. మధిర మన్నెమ్మకు రూ.27 వేలు, నసన్నాయి సాయన్నకు రూ.20 వేలు, పానుగంటి సుజాతకు రూ.60 వేలు, కొంకలి మహేష్‌కు రూ.32 వేల చొప్పున మొత్తం రూ.1,39,000 విలువైన చెక్కులను అందజేశారు. వైద్య ఖర్చుల కోసం ఆర్థిక సహాయం అందడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు.పేదలకు అండగా నిలుస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేయడం అభినందనీయమని సర్పంచ్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం, రాకాసి భీమిరెడ్డి, కొంకలి నరసింహ, మాజీ సర్పంచ్ తిక్కన్న, రాజశేఖర్ రెడ్డి, పానుగంటి వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

నిరుపేదలకు దుప్పట్ల పంపిణీకి వాసవి చిరు వ్యాపార సంఘం ఏర్పాట్లు. నిరుపేదలకు దుప్పట్ల పంపిణీకి వాసవి చిరు వ్యాపార సంఘం ఏర్పాట్లు.
ఖమ్మం బ్యూరో, నవంబర్ 18(తెలంగాణ ముచ్చట్లు ) నిరుపేదలకు చేయూతనందించే లక్ష్యంతో వాసవి చిరు వ్యాపార సంఘం ఆధ్వర్యంలో త్వరలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ...
పామిరెడ్డిపల్లిలో 37 మందికి చేయూత పింఛన్ల మంజూరు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి.
సింగిల్ విండో పీఠాలపై 'రెడ్డి'ల గురి!
బాధిత కుటుంబానికి మేఘన్న అభయహస్తం ద్వారా ఆర్థిక సాయం.
నిజాయితిగూడెంలో బీఆర్ఎస్ జెండా గద్దె కూల్చివేతపై తీవ్ర ఆగ్రహం.
27వ డివిజన్‌లో అభివృద్ధి పనులకు శ్రీకారం.