హుజురాబాద్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు బీజేపీ డిమాండ్.
*వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి.. రైతుల ధాన్యాన్ని జాప్యం లేకుండా కొనుగోలు చేయాలి*
*తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీజేపీ నాయకుల నిరసన.. వినతిపత్రం అందజేత*
హుజురాబాద్,నవంబర్ 18(తెలంగాణ ముచ్చట్లు ):
మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి, రైతులు పండించిన ధాన్యాన్ని ఎలాంటి జాప్యం లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేయాలని బీజేపీ పట్టణ శాఖ డిమాండ్ చేసింది. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జరుగుతున్న జాప్యంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేసింది.
ఈ మేరకు బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో హుజురాబాద్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం తహసీల్దార్ నరేందర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు తూర్పాటి రాజు మాట్లాడుతూ.. రైతులు ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి, పెట్టుబడులు పెట్టి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేయాలని కోరారు.


Comments