ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి.

విష్ణువర్ధన్ రెడ్డి.

ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి.

పెద్దమందడి,నవంబర్18(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పామిరెడ్డిపల్లి, దొడగుంటపల్లి గ్రామాల్లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను  ఇన్‌చార్జి చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి ప్రభుత్వం కల్పిస్తున్న కొనుగోలు సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ధాన్యాన్ని సక్రమంగా తూర్పారబట్టి, తేమ లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని రైతులకు సలహాలు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మానిటరింగ్ అధికారి మహబూబ్ అలీ, మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ కే. వెంకటేశ్వర్ రెడ్డి, పామిరెడ్డిపల్లి సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం, ఉపసర్పంచ్ రాములమ్మ, డైరెక్టర్ పెద్ద వెంకటయ్య, మాజీ ఎంపీటీసీ ఇందిరమ్మ, మాజీ ఎంపీపీ మన్యపు రెడ్డి, భీమ్ రెడ్డి, బీసీ రెడ్డి, బుడ్డరెడ్డి, కాంతి రెడ్డి, సత్యనారాయణ, సీఈఓ వి. సుధాకర్ తదితరులు, రైతులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

నిరుపేదలకు దుప్పట్ల పంపిణీకి వాసవి చిరు వ్యాపార సంఘం ఏర్పాట్లు. నిరుపేదలకు దుప్పట్ల పంపిణీకి వాసవి చిరు వ్యాపార సంఘం ఏర్పాట్లు.
ఖమ్మం బ్యూరో, నవంబర్ 18(తెలంగాణ ముచ్చట్లు ) నిరుపేదలకు చేయూతనందించే లక్ష్యంతో వాసవి చిరు వ్యాపార సంఘం ఆధ్వర్యంలో త్వరలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ...
పామిరెడ్డిపల్లిలో 37 మందికి చేయూత పింఛన్ల మంజూరు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి.
సింగిల్ విండో పీఠాలపై 'రెడ్డి'ల గురి!
బాధిత కుటుంబానికి మేఘన్న అభయహస్తం ద్వారా ఆర్థిక సాయం.
నిజాయితిగూడెంలో బీఆర్ఎస్ జెండా గద్దె కూల్చివేతపై తీవ్ర ఆగ్రహం.
27వ డివిజన్‌లో అభివృద్ధి పనులకు శ్రీకారం.