5వ వార్డులో ఘనంగా చేయూత పింఛన్ పత్రాల పంపిణీ.

5వ వార్డులో ఘనంగా చేయూత పింఛన్ పత్రాల పంపిణీ.

*అర్హులైన లబ్ధిదారులకు పింఛన్ పత్రాలు అందజేసిన మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని మనోజ్ రావు*

హుజురాబాద్,నవంబర్ 18(తెలంగాణ ముచ్చట్లు ):

హుజురాబాద్ పట్టణంలోని 5వ వార్డులో చేయూత పింఛన్ల లబ్ధిదారులకు పింఛన్ పత్రాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి రొంటాల సుహాసిని మనోజ్ రావు, 5వ వార్డు కౌన్సిలర్ సొల్లు సునీత బాబు పాల్గొని అర్హులైన లబ్ధిదారులకు చేయూత పింఛన్ పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని మనోజ్ రావు మాట్లాడుతూ పేదలు, వృద్ధులు, దివ్యాంగులు మరియు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. సమాజంలోని ప్రతి ఒక్కరికీ గౌరవప్రదమైన జీవనం కల్పించడమే సంక్షేమ పథకాల ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా ప్రజాప్రతినిధులు కృషి చేయాలని అన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

నిరుపేదలకు దుప్పట్ల పంపిణీకి వాసవి చిరు వ్యాపార సంఘం ఏర్పాట్లు. నిరుపేదలకు దుప్పట్ల పంపిణీకి వాసవి చిరు వ్యాపార సంఘం ఏర్పాట్లు.
ఖమ్మం బ్యూరో, నవంబర్ 18(తెలంగాణ ముచ్చట్లు ) నిరుపేదలకు చేయూతనందించే లక్ష్యంతో వాసవి చిరు వ్యాపార సంఘం ఆధ్వర్యంలో త్వరలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ...
పామిరెడ్డిపల్లిలో 37 మందికి చేయూత పింఛన్ల మంజూరు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి.
సింగిల్ విండో పీఠాలపై 'రెడ్డి'ల గురి!
బాధిత కుటుంబానికి మేఘన్న అభయహస్తం ద్వారా ఆర్థిక సాయం.
నిజాయితిగూడెంలో బీఆర్ఎస్ జెండా గద్దె కూల్చివేతపై తీవ్ర ఆగ్రహం.
27వ డివిజన్‌లో అభివృద్ధి పనులకు శ్రీకారం.