నిరుపేదలకు దుప్పట్ల పంపిణీకి వాసవి చిరు వ్యాపార సంఘం ఏర్పాట్లు.

నిరుపేదలకు దుప్పట్ల పంపిణీకి వాసవి చిరు వ్యాపార సంఘం ఏర్పాట్లు.

ఖమ్మం బ్యూరో, నవంబర్ 18(తెలంగాణ ముచ్చట్లు )

నిరుపేదలకు చేయూతనందించే లక్ష్యంతో వాసవి చిరు వ్యాపార సంఘం ఆధ్వర్యంలో త్వరలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సేవా కార్యక్రమానికి వనమా ట్రస్ట్ అధినేత వనమా సూరి 15 దుప్పట్లను విరాళంగా అందజేశారు. ఈ మేరకు సంఘం అధ్యక్షులు మిట్టపల్లి రవికి దుప్పట్లను అందించారు. రానున్న రోజుల్లో వీటిని పేదలకు పంపిణీ చేయనున్నట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఆర్యవైశ్య మహాసభ మాజీ ఉపాధ్యక్షులు అనిల్, ఆర్యవైశ్య నాయకులు విన్నమూరి సుబ్బారావు, కొంకిమళ్ళ మృత్యుంజయరావు, స్వాతి హాస్పిటల్, వినాయక హాస్పిటల్ అధినేత పసుమర్తి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మిట్టపల్లి రవి మాట్లాడుతూ, నిరుపేదలకు సహాయం అందించేందుకు ముందుకొచ్చి 15 దుప్పట్లు అందించిన వనమా సూరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దాతల సహకారంతో భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. సేవే లక్ష్యంగా వాసవి చిరు వ్యాపార సంఘం ముందుకు సాగడం అభినందనీయమని పలువురు కొనియాడారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

నిరుపేదలకు దుప్పట్ల పంపిణీకి వాసవి చిరు వ్యాపార సంఘం ఏర్పాట్లు. నిరుపేదలకు దుప్పట్ల పంపిణీకి వాసవి చిరు వ్యాపార సంఘం ఏర్పాట్లు.
ఖమ్మం బ్యూరో, నవంబర్ 18(తెలంగాణ ముచ్చట్లు ) నిరుపేదలకు చేయూతనందించే లక్ష్యంతో వాసవి చిరు వ్యాపార సంఘం ఆధ్వర్యంలో త్వరలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ...
పామిరెడ్డిపల్లిలో 37 మందికి చేయూత పింఛన్ల మంజూరు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి.
సింగిల్ విండో పీఠాలపై 'రెడ్డి'ల గురి!
బాధిత కుటుంబానికి మేఘన్న అభయహస్తం ద్వారా ఆర్థిక సాయం.
నిజాయితిగూడెంలో బీఆర్ఎస్ జెండా గద్దె కూల్చివేతపై తీవ్ర ఆగ్రహం.
27వ డివిజన్‌లో అభివృద్ధి పనులకు శ్రీకారం.