27వ డివిజన్‌లో అభివృద్ధి పనులకు శ్రీకారం.

రూ.16 లక్షలతో డ్రైనేజీ, ప్యాచ్‌వర్క్ పనులకు శంకుస్థాపన చేసిన మేయర్ కొలగాని శ్రీనివాస్.

27వ డివిజన్‌లో అభివృద్ధి పనులకు శ్రీకారం.

కరీంనగర్, నవంబర్ 18 (తెలంగాణ ముచ్చట్లు):

నగరపాలక సంస్థ అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. నగర అభివృద్ధిలో భాగంగా బుధవారం 27వ డివిజన్‌లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ బొట్ల శ్యామల కిరణ్ కుమార్‌తో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

శివాజీనగర్‌లో నగరపాలక సంస్థకు చెందిన రూ.10 లక్షల నిధులతో ఎస్‌డబ్ల్యూజీ డ్రైనేజీ, ప్యాచ్‌వర్క్ నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. అనంతరం ఆదర్శనగర్ వాటర్ ట్యాంక్ వద్ద రూ.6 లక్షల నిధులతో చేపట్టనున్న డ్రైనేజీ నిర్మాణ పనులకు భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు.

చేపట్టిన అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో వేగవంతంగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను, కాంట్రాక్టర్లను మేయర్ ఆదేశించారు. నగరంలోని అన్ని డివిజన్లలో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

నిరుపేదలకు దుప్పట్ల పంపిణీకి వాసవి చిరు వ్యాపార సంఘం ఏర్పాట్లు. నిరుపేదలకు దుప్పట్ల పంపిణీకి వాసవి చిరు వ్యాపార సంఘం ఏర్పాట్లు.
ఖమ్మం బ్యూరో, నవంబర్ 18(తెలంగాణ ముచ్చట్లు ) నిరుపేదలకు చేయూతనందించే లక్ష్యంతో వాసవి చిరు వ్యాపార సంఘం ఆధ్వర్యంలో త్వరలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ...
పామిరెడ్డిపల్లిలో 37 మందికి చేయూత పింఛన్ల మంజూరు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి.
సింగిల్ విండో పీఠాలపై 'రెడ్డి'ల గురి!
బాధిత కుటుంబానికి మేఘన్న అభయహస్తం ద్వారా ఆర్థిక సాయం.
నిజాయితిగూడెంలో బీఆర్ఎస్ జెండా గద్దె కూల్చివేతపై తీవ్ర ఆగ్రహం.
27వ డివిజన్‌లో అభివృద్ధి పనులకు శ్రీకారం.