రూ.5,116 పెళ్లి కానుకతో నూతన వధూవరులను ఆశీర్వదించిన సర్పంచ్.
వేలేరు, నవంబర్ 18 (తెలంగాణ ముచ్చట్లు):
హనుమకొండ జిల్లా వేలేరు మండలం పీచర గ్రామంలో గొల్లెన కనకలక్ష్మి–యాదగిరి దంపతుల కుమార్తె సంధ్య–రాజుల వివాహ వేడుకకు పీచర గ్రామ సర్పంచ్ మరిజే అనిత–నరసింహారావు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా నూతన దంపతులకు రూ.5,116 సర్పంచ్ పెళ్లి కానుకగా అందజేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మరిజే అనిత మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆదర్శంగా తీసుకొని గ్రామంలోని ప్రతి నిరుపేద కుటుంబానికి చెందిన ఆడబిడ్డ వివాహానికి తన వంతు సహాయంగా పెళ్లి కానుక అందిస్తానని తెలిపారు. పేద కుటుంబాలకు అండగా నిలవడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ గుడికందుల ప్రశాంత్, వార్డు సభ్యులు జగన్, గుడికందుల రాకేష్, మాజీ మండల కో-ఆప్షన్ సభ్యుడు ఎండీ జానీ, మారబోయిన రాజు, గొల్లెన రమేష్, ఆవునూరి శ్యామ్ కృష్ణ, హింగే మనోహర్ తదితరులు పాల్గొన్నారు.


Comments