నిజాయితిగూడెంలో బీఆర్ఎస్ జెండా గద్దె కూల్చివేతపై తీవ్ర ఆగ్రహం.

కూల్చివేసిన జెండా గద్దెను పరిశీలించిన జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు జి.వి. రామకృష్ణ రావు..

నిజాయితిగూడెంలో బీఆర్ఎస్ జెండా గద్దె కూల్చివేతపై తీవ్ర ఆగ్రహం.

మానకొండూర్, నవంబర్ 18 (తెలంగాణ ముచ్చట్లు):

మానకొండూర్ నియోజకవర్గంలోని నిజాయితిగూడెం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ జెండా గద్దెను కూల్చివేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. ఈ ఘటన నేపథ్యంలో కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు జి.వి. రామకృష్ణ రావు గ్రామాన్ని సందర్శించి కూల్చివేసిన జెండా గద్దెను పరిశీలించారు. ఈ సందర్భంగా ఘటనకు సంబంధించిన వివరాలను స్థానిక నాయకులు, పార్టీ శ్రేణులను అడిగి తెలుసుకున్నారు.

గ్రామంలో బీఆర్ఎస్ పార్టీకి పెరుగుతున్న ప్రజాదరణను, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల పక్షాన నిలబడటాన్ని జీర్ణించుకోలేక కొందరు ఇలాంటి చిల్లర, అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. తమను నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేక ఇలాంటి దిగజారుడు పనులకు పాల్పడటం వారి అసహనానికి నిదర్శనమని పేర్కొన్నారు.

ఈ ఘటనకు పాల్పడిన వారిని వెంటనే గుర్తించి, వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ శ్రేణులందరూ ఐక్యంగా ఉండి పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇలాంటి చర్యలకు ఏమాత్రం వెనకడుగు వేయకుండా మరింత ఐకమత్యంతో ముందుకు సాగాలని సూచించారు.

బీఆర్ఎస్ జెండా గద్దెను కూల్చివేయగలరేమో కానీ, ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న కేసీఆర్ పట్ల ఉన్న అభిమానం, ఆదరణను మాత్రం ఎవరూ చెరిపివేయలేరని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అంటే కేవలం జెండా కాదని, అది ప్రజల నమ్మకానికి, ఉద్యమ స్ఫూర్తికి, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

నిరుపేదలకు దుప్పట్ల పంపిణీకి వాసవి చిరు వ్యాపార సంఘం ఏర్పాట్లు. నిరుపేదలకు దుప్పట్ల పంపిణీకి వాసవి చిరు వ్యాపార సంఘం ఏర్పాట్లు.
ఖమ్మం బ్యూరో, నవంబర్ 18(తెలంగాణ ముచ్చట్లు ) నిరుపేదలకు చేయూతనందించే లక్ష్యంతో వాసవి చిరు వ్యాపార సంఘం ఆధ్వర్యంలో త్వరలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ...
పామిరెడ్డిపల్లిలో 37 మందికి చేయూత పింఛన్ల మంజూరు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి.
సింగిల్ విండో పీఠాలపై 'రెడ్డి'ల గురి!
బాధిత కుటుంబానికి మేఘన్న అభయహస్తం ద్వారా ఆర్థిక సాయం.
నిజాయితిగూడెంలో బీఆర్ఎస్ జెండా గద్దె కూల్చివేతపై తీవ్ర ఆగ్రహం.
27వ డివిజన్‌లో అభివృద్ధి పనులకు శ్రీకారం.