ప్రతి కుటుంబానికి అండగా ఉంటాం.

నూతన పెన్షన్ పత్రాలు అందజేసిన 10వ వార్డు కౌన్సిలర్ తూర్పాటి చందన .

ప్రతి కుటుంబానికి అండగా ఉంటాం.

జమ్మికుంట, నవంబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు):

వార్డులోని ప్రతి కుటుంబానికి అండగా ఉంటూ, ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని జమ్మికుంట మున్సిపాలిటీ 10వ వార్డు కౌన్సిలర్ తూర్పాటి చందన శంకర్ అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా 10వ వార్డులో నూతనంగా పెన్షన్లు మంజూరైన లబ్ధిదారులకు కౌన్సిలర్ తూర్పాటి చందన శంకర్ స్వయంగా పెన్షన్ మంజూరు పత్రాలను అందజేశారు. పెన్షన్లు మంజూరు కావడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ప్రభుత్వం అందించే పెన్షన్ ఆర్థికంగా ఎంతో తోడ్పాటునిస్తుందని ఆమె పేర్కొన్నారు.
వార్డులో అర్హత ఉన్నప్పటికీ వివిధ కారణాలతో సంక్షేమ పథకాలు అందని వారి వివరాలను సేకరించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ప్రజలకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తూ, ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేస్తానన్నారు.
ప్రజాప్రతినిధిగా ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వార్డు అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తానని చందన శంకర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పెన్షన్ లబ్ధిదారులు, స్థానికులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News