వంగాలపల్లిలో అర్హులకు పెన్షన్ల పంపిణీ.
లబ్ధిదారులకు పెన్షన్లు అందజేసిన సర్పంచ్ భూక్య మేనక, ఉపసర్పంచ్ అరూరి రవిచందర్.
Views: 0
On
వంగాలపల్లి,నవంబర్ 19(తెలంగాణ ముచ్చట్లు):
వంగాలపల్లి గ్రామపంచాయతీ పరిధిలో గురువారం అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ భూక్య మేనక సుధాకర్ నాయక్, ఉపసర్పంచ్ అరూరి రవిచందర్ లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్, ఉపసర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలోని అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అందేలా కృషి చేస్తామని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా గ్రామ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ, సంక్షేమ పథకాలు అర్హులైన వారికి చేరేలా నిరంతరం అందుబాటులో ఉంటామని పేర్కొన్నారు. గ్రామ ప్రజల సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సభ్యులు, గ్రామ అధ్యక్షుడు మాట్యాడ అశోక్, గ్రామ కార్యదర్శి మమత తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
19 Nov 2026 20:44:30
* మహిళల్లో ధైర్యం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందాలి: నిత్యశ్రీ
జమ్మికుంట, నవంబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు):
భారత స్వాతంత్ర్య సంగ్రామంలో వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి ప్రదర్శించిన...


Comments