జమ్మికుంటలో ఆధునిక వైద్య సేవలకు శ్రీకారం.

జమ్మికుంటలో ఆధునిక వైద్య సేవలకు శ్రీకారం.

* రిషిక మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభం

* అడ్వాన్స్‌డ్ లాప్రోస్కోపీ, లేజర్ సర్జరీ సేవలు అందుబాటులోకి

జమ్మికుంట, నవంబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు):

జమ్మికుంట పట్టణ ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా నూతనంగా ఏర్పాటు చేసిన రిషిక మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని బుధవారం ఘనంగా ప్రారంభించారు. డాక్టర్ బి. రమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రిని ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా హనుమకొండలోని కూరపాటి ఆసుపత్రికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ కూరపాటి రమేష్ ఆధ్వర్యంలో అడ్వాన్స్‌డ్ లాప్రోస్కోపీ, లేజర్ సర్జరీ వైద్య సేవలను ప్రారంభించారు. ఇకపై ప్రతి మంగళవారం డాక్టర్ కూరపాటి రమేష్ జమ్మికుంటలోని రిషిక మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో అందుబాటులో ఉండి రోగులకు వైద్య సేవలు అందించనున్నారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ మాట్లాడుతూ జమ్మికుంట పట్టణంతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు స్థానికంగానే అందుబాటులోకి రావడం సంతోషకరమన్నారు. మెరుగైన వైద్య సదుపాయాలను ప్రజలకు అందించేందుకు ముందుకొచ్చిన ఆసుపత్రి యాజమాన్యాన్ని అభినందించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ మాచర్ల రాజు, ఆసుపత్రి నిర్వాహకులు, వైద్యులు, సిబ్బంది, పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News