పౌల్ట్రీ ఫారాల నిర్లక్ష్యం.. కుక్కల దాడిలో  దుడ్డే  మృతి!

పౌల్ట్రీ ఫారాల నిర్లక్ష్యం.. కుక్కల దాడిలో  దుడ్డే  మృతి!

వేలేరు, నవంబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు):

హనుమకొండ జిల్లా వేలేరు మండలం గుండ్లసాగర్ గ్రామంలో పౌల్ట్రీ వ్యర్థాల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి చెందిన పెడ్డిరెడ్డి, రాజిరెడ్డి నిర్వహిస్తున్న పౌల్ట్రీ ఫారాల నుంచి మృతి చెందిన కోళ్లను వ్యవసాయ భూముల్లో ఎలాంటి రక్షణ చర్యలు లేకుండా బహిరంగంగా పడేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
ఈ క్రమంలో మృతి చెందిన కోళ్లను తింటున్న కుక్కలు ఆహారం కోసం చుట్టుపక్కల వ్యవసాయ భూముల్లో సంచరిస్తూ పశువులపై దాడులకు పాల్పడుతున్నాయని తెలిపారు. బుధవారం గుండ్లసాగర్ గ్రామానికి చెందిన వంగ రాజేందర్ తండ్రి కొమురయ్యకు చెందిన వ్యవసాయ బావి వద్ద ఉన్న బర్రె దూడను కుక్కలు దాడి చేసి చంపినట్లు వెల్లడించారు.
అంతేకాకుండా వ్యవసాయ పనులకు వెళ్లే రైతుల వెంట కుక్కలు పడి భయాందోళనలకు గురిచేస్తున్నాయని చుట్టుపక్కల రైతులు వాపోతున్నారు. పౌల్ట్రీ ఫారాల నిర్వాహకులు మృతి చెందిన కోళ్లను నిబంధనలకు అనుగుణంగా పారవేయకుండా వ్యవసాయ భూముల్లో పడేయడం వల్లే ఈ సమస్య తలెత్తుతోందని రైతులు ఆరోపిస్తున్నారు.
సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పౌల్ట్రీ ఫారాల నిర్వాహకులపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని, మృతి చెందిన దూడ యజమానికి న్యాయం చేయడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని రైతులు కోరుతున్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఝాన్సీ లక్ష్మీబాయి పోరాట స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శం. ఝాన్సీ లక్ష్మీబాయి పోరాట స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శం.
* మహిళల్లో ధైర్యం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందాలి: నిత్యశ్రీ జమ్మికుంట, నవంబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు): భారత స్వాతంత్ర్య సంగ్రామంలో వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి ప్రదర్శించిన...
విద్యార్థులకు చేయూత.
ఇందిరమ్మ ఆశయాలే కాంగ్రెస్ ప్రభుత్వానికి మార్గదర్శకం.
ఉద్యమకారుల హక్కుల కోసం మేడారం నుంచి మరో పోరుబాట.
మహిళా సాధికారతకు సిరిసేడులో కొత్త వేదిక.
దేశ రాజకీయ వ్యవస్థలో మార్పులకు యువతే దిక్సూచి.
మాదిగ ఉపకులాల వనభోజనాలకు ప్రముఖులకు ఆహ్వానం.