మాదిగ ఉపకులాల వనభోజనాలకు ప్రముఖులకు ఆహ్వానం.
చాకలి ఐలమ్మ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి. మల్లేశం, ఫుడ్ కమిషన్ సభ్యుడు ఓరుగంటి ఆనంద్‌కు ఆహ్వానం పలికిన డాక్టర్ పిడమర్తి రవి
హైదరాబాద్,నవంబర్ 19(తెలంగాణ ముచ్చట్లు):
హైదరాబాద్‌లోని పబ్లిక్ గార్డెన్స్‌లో నవంబర్ 29న నిర్వహించనున్న మాదిగ ఉపకులాల వనభోజనాల కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి. మల్లేశం, ఫుడ్ కమిషన్ సభ్యుడు ఓరుగంటి ఆనంద్‌లను ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా డాక్టర్ పిడమర్తి రవి వారిని కలిసి నవంబర్ 29న నిర్వహించనున్న వనభోజనాల కార్యక్రమం వివరాలను తెలియజేశారు. మాదిగ ఉపకులాల మధ్య ఐక్యత, సోదరభావం, ఆత్మీయ అనుబంధాలను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు. వివిధ ప్రాంతాలకు చెందిన మాదిగ ఉపకులాల నాయకులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, మేధావులు, యువత, సంఘాల ప్రతినిధులు ఒకే వేదికపై కలుసుకునేలా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
సమాజంలో మాదిగ ఉపకులాల ఐక్యతను చాటడంతో పాటు పరస్పర పరిచయాలు, ఆత్మీయతలు, సామాజిక సంబంధాలను పెంపొందించుకోవడానికి ఇలాంటి సమావేశాలు దోహదపడతాయని పేర్కొన్నారు. అందరూ కుటుంబ సమేతంగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
నవంబర్ 29న హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లో జరిగే ఈ వనభోజనాల కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానిస్తూ నిర్వాహకులు ఏర్పా
ట్లు చేస్తున్నారు. మాదిగ ఉపకులాల ప్రజలు, నాయకులు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిస్తున్నారు.


Comments