సిద్దిపేట భారీ బహిరంగ సభకు తరలిన వంగర కాంగ్రెస్ నాయకులు.

సిద్దిపేట భారీ బహిరంగ సభకు తరలిన వంగర కాంగ్రెస్ నాయకులు.

భీమదేవరపల్లి, నవంబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు):

సిద్దిపేట భారీ బహిరంగ సభకు భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. పార్టీ అధిష్ఠానం ఇచ్చిన పిలుపు మేరకు ప్రత్యేక వాహనాల్లో సభా ప్రాంగణానికి బయలుదేరారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాలు, ప్రజా సమస్యల పరిష్కారానికి సంబంధించిన సభల్లో వంగర గ్రామ కాంగ్రెస్ శ్రేణులు చురుకుగా పాల్గొంటాయని తెలిపారు. పార్టీ నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు సభకు తరలివెళ్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో వంగర గ్రామ సర్పంచ్ గజ్జెల సృజన రమేష్, గ్రామ శాఖ అధ్యక్షుడు వల్లాల రమేష్, శ్రీరామోజు మొండయ్య, చంద్రారెడ్డి, తిరుపతి, మైసయ్యతో పాటు పలువురు గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News