ఉక్కు మహిళ ఇందిరాగాంధీకి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఘన నివాళి.

ఇందిరా చౌక్‌లో విగ్రహానికి పూలమాల.. ఇందిరమ్మ భీమా పోస్టర్ ఆవిష్కరణ.

ఉక్కు మహిళ ఇందిరాగాంధీకి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఘన నివాళి.

కరీంనగర్, నవంబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు):

భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి, ఉక్కు మహిళ స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఇందిరా చౌక్ వద్ద ఆమె విగ్రహానికి చొప్పదండి శాసనసభ్యులు, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డా. మేడిపల్లి సత్యం జిల్లా కాంగ్రెస్ నాయకులతో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఇందిరమ్మ భీమా పోస్టర్‌ను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో మాజీ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్‌తో పాటు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఝాన్సీ లక్ష్మీబాయి పోరాట స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శం. ఝాన్సీ లక్ష్మీబాయి పోరాట స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శం.
* మహిళల్లో ధైర్యం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందాలి: నిత్యశ్రీ జమ్మికుంట, నవంబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు): భారత స్వాతంత్ర్య సంగ్రామంలో వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి ప్రదర్శించిన...
విద్యార్థులకు చేయూత.
ఇందిరమ్మ ఆశయాలే కాంగ్రెస్ ప్రభుత్వానికి మార్గదర్శకం.
ఉద్యమకారుల హక్కుల కోసం మేడారం నుంచి మరో పోరుబాట.
మహిళా సాధికారతకు సిరిసేడులో కొత్త వేదిక.
దేశ రాజకీయ వ్యవస్థలో మార్పులకు యువతే దిక్సూచి.
మాదిగ ఉపకులాల వనభోజనాలకు ప్రముఖులకు ఆహ్వానం.