మహిళా సాధికారతకు సిరిసేడులో కొత్త వేదిక.

సిరిసేడులో మహిళా సమాఖ్య భవనం ప్రారంభం.

మహిళా సాధికారతకు సిరిసేడులో కొత్త వేదిక.

ఇల్లందకుంట, నవంబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు):

మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి మహిళా సమాఖ్య భవనాలు ఎంతగానో దోహదపడతాయని సిరిసేడు గ్రామ సర్పంచ్ రేణుకుంట్ల శ్యామల–కుమార్ అన్నారు.
కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం సిరిసేడు గ్రామంలో నూతనంగా నిర్మించిన మహిళా సమాఖ్య భవనాన్ని సర్పంచ్ రేణుకుంట్ల శ్యామల–కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో మహిళా సంఘాల సభ్యులు సమావేశాలు నిర్వహించుకోవడానికి సరైన వసతి లేక చెట్ల కింద సమావేశాలు నిర్వహిస్తూ అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారని తెలిపారు. నూతన భవనం అందుబాటులోకి రావడంతో మహిళా సంఘాల సభ్యులకు ఆ ఇబ్బందులు తొలగనున్నాయని పేర్కొన్నారు.
ఈ భవనం మహిళా సంఘాల సమావేశాలు, స్వయం సహాయక సంఘాల కార్యకలాపాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, మహిళలు సంఘటితంగా ముందుకు సాగుతూ ఆర్థికంగా అభివృద్ధి సాధించేందుకు దోహదపడుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పాలకవర్గ సభ్యులు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.IMG-20261119-WA0026

Tags:

Post Your Comments

Comments

Latest News