రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు పెద్దమందడి విద్యార్థినుల ఎంపిక.

రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు పెద్దమందడి విద్యార్థినుల ఎంపిక.

పెద్దమందడి,నవంబర్19(తెలంగాణ ముచ్చట్లు):

రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ అండర్‌-17 బాలికల హాకీ పోటీలకు వనపర్తి జిల్లా పెద్దమందడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థినులు ఎంపికయ్యారు.ఈ నెల 20, 21, 22 తేదీలలో వరంగల్‌లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి హాకీ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు పెద్దమందడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న రేవతి, 8వ తరగతి చదువుతున్న హరిణి, శిల్ప ఎంపికైనట్లు మండల విద్యాధికారి శాంతన్న, ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయులు కురుమూర్తి, ఫిజికల్ డైరెక్టర్ మన్యం యాదవ్ తెలిపారు.రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థినులను గ్రామ సర్పంచ్ గంగమ్మ రవి, ఉపసర్పంచ్ ఉషన్న యాదవ్, పాఠశాల ఉపాధ్యాయ బృందం, గ్రామస్తులు, తోటి విద్యార్థులు అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News