పెద్దమందడిలో ఘనంగా ఇందిరా గాంధీ జయంతి వేడుకలు.

పెద్దమందడిలో ఘనంగా ఇందిరా గాంధీ జయంతి వేడుకలు.

పెద్దమందడి,నవంబర్19(తెలంగాణ ముచ్చట్లు):

భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి వేడుకలను వనపర్తి జిల్లా పెద్దమందడి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఐ. సత్యారెడ్డి, మండల అధ్యక్షుడు కొమ్ము వెంకటస్వామి ఆధ్వర్యంలో ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశ సమగ్రత, అభివృద్ధి, పేదరిక నిర్మూలన కోసం ఇందిరా గాంధీ చేసిన సేవలు, త్యాగాలు చిరస్మరణీయమని అన్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆమె ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజల హృదయాల్లో నిలిచిపోయాయని పేర్కొన్నారు. ఇందిరా గాంధీ ఆశయాలను కొనసాగిస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ వెంకటేష్ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ రామకృష్ణ రెడ్డి, మాజీ ఎంపీపీ రఘు ప్రసాద్, స్థానిక సర్పంచ్ సూర్య గంగమ్మ రవి, ఉప సర్పంచ్ ఉషన్న యాదవ్, చిన్నమందడి సర్పంచ్ స్వరూప, అనకాయిపల్లి తండా సర్పంచ్ ఆంజనేయులు, స్కూల్ తండా సర్పంచ్ మాన్యం, మాజీ సింగిల్ విండో డైరెక్టర్ వాకిటి నరేష్, 6వ వార్డు సభ్యుడు కొమ్ము సత్యనారాయణ పాల్గొన్నారు.అలాగే కాంగ్రెస్ నాయకులు పల్లె సత్యనారాయణ, ఐ. ప్రవీణ్ కుమార్ రెడ్డి, రాధాకృష్ణ, గట్టు యాదవ్, శేఖర్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, శ్రీశైలం యాదవ్, చంద్రయ్య, పర్వతాలు, రాజు, సుర వెంకటస్వామి, బీచుపల్లి, వాకిటి దర్శన్, టీఎంఆర్ నాయకులు గట్టు రాజశేఖర్, ఎస్. శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News