విద్యార్థులకు చేయూత.

క్రీడా దుస్తులు, 180 స్టీల్ గ్లాసుల పంపిణీ.

విద్యార్థులకు చేయూత.

హుజురాబాద్, నవంబర్ 19(తెలంగాణ ముచ్చట్లు ):

చిన్నారుల చిన్న చేతుల్లో ఎన్నో పెద్ద కలలు దాగి ఉన్నాయని, ఆ కలలను సాకారం చేసుకునేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని హుజురాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ రోంటాల సుహాసిని మనోజ్‌రావు అన్నారు. విద్యార్థుల చదువు, ఆరోగ్యం, క్రీడాభివృద్ధికి ప్రోత్సాహం అందించాలనే లక్ష్యంతో జయన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎంపీయూపీఎస్ పాఠశాలలోని బాలబాలికలకు ఉచితంగా స్పోర్ట్స్ దుస్తులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో చైర్‌పర్సన్ రోంటాల సుహాసిని పాల్గొని విద్యార్థులకు క్రీడా దుస్తులను అందజేశారు. చిన్నారుల అవసరాలను గుర్తించి వారికి చేయూత అందించడం ఎంతో సంతృప్తినిస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని, శారీరక దృఢత్వంతోపాటు మానసిక ఉల్లాసాన్ని పెంపొందించుకోవాలని ఆకాంక్షించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News