రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం.

రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం.

*వ్యవసాయ మార్కెట్ యార్డు, బొమ్మకల్‌లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన మేయర్ కొలగాని శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య.*

కరీంనగర్, నవంబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు):

రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం కొనుగోళ్లు సజావుగా జరిగేలా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. గురువారం కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్యతో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మేయర్ ప్రారంభించారు.

అనంతరం నగరపాలక సంస్థ పరిధిలోని బొమ్మకల్ ప్రాంతంలో కొబ్బరికాయ కొట్టి, రిబ్బన్ కట్ చేసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ధాన్యాన్ని తూకం వేసి కొనుగోలు ప్రక్రియను ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మేయర్ కొలగాని శ్రీనివాస్‌ను రైతులు, రైతు సంఘాల నాయకులు శాలువాతో ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ పెండ్యాల శ్యాంసుందర్ రెడ్డి, కార్పొరేటర్లు మేకల వెంకటేష్, గాదె రూప శ్రీనివాస్, నాయకులు పురుమల్ల శ్రీనివాస్, రాంరెడ్డి, డైరెక్టర్లు బీరం ఆంజనేయులు, సాయిల్ల మహేందర్, బోనాల లింగయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఝాన్సీ లక్ష్మీబాయి పోరాట స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శం. ఝాన్సీ లక్ష్మీబాయి పోరాట స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శం.
* మహిళల్లో ధైర్యం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందాలి: నిత్యశ్రీ జమ్మికుంట, నవంబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు): భారత స్వాతంత్ర్య సంగ్రామంలో వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి ప్రదర్శించిన...
విద్యార్థులకు చేయూత.
ఇందిరమ్మ ఆశయాలే కాంగ్రెస్ ప్రభుత్వానికి మార్గదర్శకం.
ఉద్యమకారుల హక్కుల కోసం మేడారం నుంచి మరో పోరుబాట.
మహిళా సాధికారతకు సిరిసేడులో కొత్త వేదిక.
దేశ రాజకీయ వ్యవస్థలో మార్పులకు యువతే దిక్సూచి.
మాదిగ ఉపకులాల వనభోజనాలకు ప్రముఖులకు ఆహ్వానం.