పీచర గ్రామంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం.

పీచర గ్రామంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం.

వేలేరు, నవంబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు):

హనుమకొండ జిల్లా వేలేరు మండలం పీచర గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ మరిజే అనిత–నర్సింగరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పించి, ధాన్యం కొనుగోళ్లను సజావుగా నిర్వహించాలని సూచించారు.
రైతులు తమ ధాన్యాన్ని దళారులకు విక్రయించి నష్టపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గుడికందుల ప్రశాంత్, వార్డు సభ్యులు గుడికందుల రాకేష్,ఎపిఎం అనిత, సీసీ సతీష్, మహిళా సంఘాల సీఏలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News