ఇందిరమ్మ జీవిత బీమా పథకంతో ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా.
కొమ్ము వెంకటస్వామి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు.
పెద్దమందడి,నవంబర్19(తెలంగాణ ముచ్చట్లు):
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని పెద్దమందడి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొమ్ము వెంకటస్వామి సూచించారు.ఆయన ఆధ్వర్యంలో పెద్దమందడి మండలంలోని వెల్టూర్ గ్రామంలో ఇందిరమ్మ జీవిత బీమా పథకానికి సంబంధించిన కరపత్రాలను కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కొమ్ము వెంకటస్వామి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా కల్పించే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించిందన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని తెలిపారు.కుటుంబానికి ఆపద సమయంలో ఆర్థికంగా అండగా నిలిచేందుకు ఈ బీమా పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ పథకం వివరాలను తెలుసుకొని దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని గ్రామీణ ప్రాంత ప్రజలు ముఖ్యంగా సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని గ్రామస్థులకు ఇందిరమ్మ జీవిత బీమా పథకంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు ప్రేమ్ సాగర్, చింతల వెంకటేశ్వర్లు, నవీన్, కుమ్మరి కొండన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Comments