ఎమ్మెల్యే చొరవతో వెల్టూర్ కు సింగిల్ విండో మంజూరు.
హర్షం వ్యక్తం చేసిన పెద్దమందడి మండల కాంగ్రెస్ నాయకులు.
పెద్దమందడి,నవంబర్19(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి నియోజకవర్గంలోని పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామానికి నూతన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (సింగిల్ విండో) మంజూరు కావడం పట్ల పెద్దమందడి మండల కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రత్యేక చొరవ, కృషితో వెల్టూర్ గ్రామానికి సింగిల్ విండో మంజూరు కావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం, అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తీసుకుంటున్న ప్రత్యేక చొరవ అభినందనీయమని అన్నారు. వెల్టూర్ గ్రామానికి సింగిల్ విండో మంజూరు కావడం ఆ ప్రాంత రైతులకు ఎంతో ప్రయోజనకరమని పేర్కొన్నారు. ఇప్పటివరకు వ్యవసాయ అవసరాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చిన రైతులకు ఇకపై స్థానికంగానే సహకార సేవలు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు.సింగిల్ విండో ద్వారా రైతులకు వ్యవసాయ రుణాలు, ఎరువులు, విత్తనాలు తదితర సేవలు సులభంగా అందడంతో పాటు రైతుల సమయం, ప్రయాణ ఖర్చులు ఆదా అవుతాయని అన్నారు. రైతుల చిరకాల అవసరాన్ని గుర్తించి వెల్టూర్ గ్రామానికి సింగిల్ విండో మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.అలాగే నూతన సింగిల్ విండోల ఏర్పాటుకు సహకరించిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు పెద్దమందడి మండల కాంగ్రెస్ నాయకులు ధన్యవాదాలు తెలియజేశారు. రైతుల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, భవిష్యత్తులోనూ రైతుల సంక్షేమానికి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వనపర్తి మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, పెద్దమందడి మాజీ ఎంపీపీ రఘు ప్రసాద్, వెల్టూర్ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, వెల్టూరు ఉండి చేనేత సహకార సంఘం అధ్యక్షులు వెంకటేశ్వర్లు, సీనియర్ నాయకులు డిఎస్ మహేష్, వెల్టూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రేమ్ సాగర్, వడ్డే శేఖర్, డీలర్ శ్రీనివాసులు, వివేక్, రాంసింగ్, చింతకాయల వెంకటేష్, రామచంద్రయ్య, వార్డు సభ్యులు నాగభూషణ్, బజార్ వెంకటేష్, నాగార్జున, శ్రీను, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Comments