పీచరలో లబ్ధిదారులకు చేయూత పింఛన్ల పంపిణీ.
వేలేరు, నవంబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు):
హనుమకొండ జిల్లా వేలేరు మండలం పీచర గ్రామంలో చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మరిజే అనిత నర్సింగరావు లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న పింఛన్లను అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వృద్ధులు, దివ్యాంగులు తదితర అర్హులకు పింఛన్లు ఆర్థిక భరోసాగా నిలుస్తున్నాయని తెలిపారు. గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని, గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి జితేందర్ రెడ్డి, ఉపసర్పంచ్ గుడికందుల ప్రశాంత్, వార్డు సభ్యులు కొలిపాక వెంకటేష్, గుడికందుల రాకేష్, వొద్దుల శ్రీకాంత్, రామంచ ప్రశాంత్, ఎడ్ల అశ్విని, సౌజన్య, సుకన్య, పింఛన్ లబ్ధిదారులు పాల్గొన్నారు.


Comments