దేశ రాజకీయ వ్యవస్థలో మార్పులకు యువతే దిక్సూచి.

దేశ రాజకీయ వ్యవస్థలో మార్పులకు యువతే దిక్సూచి.

*ఉన్నత విద్యావంతులు రాజకీయాల్లోకి రావాలి..*

*ప్రజాస్వామ్యంపై విద్యార్థులకు అవగాహన అవసరం – బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యాదగిరి సునీల్ రావు.*

కరీంనగర్, నవంబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు):

ఉన్నత చదువులు చదివిన యువత క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పుడే దేశ రాజకీయ వ్యవస్థలో సమూల మార్పులు సాధ్యమవుతాయని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ మేయర్, ప్రస్తుత నగర డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు పిలుపునిచ్చారు. ప్రపంచంలోనే భారత ప్రజాస్వామ్యం అత్యున్నతమైనదని, విద్యార్థులు చిన్న వయస్సు నుంచే పార్లమెంటరీ వ్యవస్థపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. నిత్యం వార్తాపత్రికలు చదువుతూ, పార్లమెంట్, అసెంబ్లీ సమావేశాలను వీక్షిస్తూ సమకాలీన రాజకీయాలపై పట్టు సాధించాలని పేర్కొన్నారు.

కరీంనగర్‌లోని త్రిధ హోటల్‌లో అద్వైత ఇంటర్నేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘అద్వైత యూత్ పార్లమెంట్–2026’ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వివేకానంద విద్యాసంస్థల చైర్మన్, కార్పొరేటర్ సౌగాని కొమరయ్యతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక నృత్యాలు, ఎంపీల వేషధారణలో విద్యార్థులు నిర్వహించిన చర్చలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఈ సందర్భంగా యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ.. గత 30 ఏళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతూ ఆరు సార్లు కార్పొరేటర్‌గా, మేయర్‌గా, ప్రస్తుతం డిప్యూటీ మేయర్‌గా ప్రజాసేవ చేస్తున్నట్లు తెలిపారు. పొరుగు దేశాల్లో సైనిక పాలన, నియంతృత్వ పోకడలు, అస్థిర ప్రభుత్వాలు కనిపిస్తున్నప్పటికీ, 148 కోట్ల జనాభా కలిగిన భారతదేశంలో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థ బలంగా కొనసాగుతోందని అన్నారు. ఇంతటి గొప్ప ప్రజాస్వామ్య దేశంలో పౌరుడిగా జన్మించడం అదృష్టమని పేర్కొన్నారు.

గత 12 ఏళ్లుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బలమైన నాయకత్వంలో భారత్‌కు ప్రపంచవ్యాప్తంగా విశేష గౌరవం లభిస్తోందని, 35 దేశాలు ప్రధానమంత్రికి అత్యున్నత పురస్కారాలు అందించడం దేశానికి గర్వకారణమIMG-20261119-WA0037ని కొనియాడారు. చిన్న వయస్సులోనే విద్యార్థులకు చట్టసభల పనితీరుపై అవగాహన కల్పిస్తున్న అద్వైత ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యాన్ని అభినందిస్తూ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News