ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా రక్షణ.!

కులం, మతం, ఆదాయంతో సంబంధం లేకుండా ఆర్థిక భరోసా.

ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా రక్షణ.!

సత్తుపల్లి, నవంబరు 20 (తెలంగాణ ముచ్చట్లు):

ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని అమలు చేస్తోందని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ అన్నారు. కులం, మతం, ఆదాయంతో సంబంధం లేకుండా ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా రక్షణ కల్పించడం గొప్ప సంక్షేమ కార్యక్రమమని పేర్కొన్నారు. శుక్రవారం సత్తుపల్లి మున్సిపాలిటీ 14వ వార్డు, పెనుబల్లి మండలం బయన్నగూడెంలో నిర్వహించిన ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభోత్సవాల్లో ఆమె పాల్గొన్నారు. అనుకోని ప్రమాదాలు, కుటుంబ సభ్యుల మరణంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే కుటుంబాలకు ఈ పథకం అండగా నిలుస్తుందన్నారు. కుటుంబ పెద్దను కోల్పోయిన సందర్భాల్లో బాధిత కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించి, భవిష్యత్తుకు భద్రత కల్పించడమే దీని ఉద్దేశమని వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పలు పథకాలను అమలు చేస్తోందన్నారు. అర్హులైన ప్రతి కుటుంబం బీమా పథకంలో నమోదు చేసుకోవాలని సూచించారు. ఇందుకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు లేదా ఫుడ్ సెక్యూరిటీ కార్డు, మొబైల్ నంబర్ తదితర వివరాలను సిద్ధం చేసుకుని సంబంధిత అధికారులను సంప్రదించాలని కోరారు. నవంబర్ 19 నుంచి నమోదు ప్రక్రియ ప్రారంభమైనట్లు తెలిపారు. ప్రతి కుటుంబానికి భద్రత, ప్రతి పౌరుడికి భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ చల్లగుళ్ల నరసింహారావు, మున్సిపల్ చైర్‌పర్సన్ రిహనా బేగం, మున్సిపల్ అధికారులు, వార్డు కౌన్సిలర్లు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గాదె చెన్నారావు,  పెనుబల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పంది వెంకటేశ్వరIMG-20261120-WA0014రావు, ఎంఆర్ఓ, ఎంపీఓ, గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఇందిరమ్మ జీవిత బీమా భరోసా పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి. ఇందిరమ్మ జీవిత బీమా భరోసా పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి.
*అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక రక్షణ.. పథకం అమలులో నిర్లక్ష్యం వద్దని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశం.* మానకొండూర్, నవంబర్ 20 (తెలంగాణ ముచ్చట్లు): పేద,...
ఇందిరమ్మ కుటుంబ బీమాతో ప్రతి ఇంటికి ఆర్థిక భద్రత.
నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే.
విద్యార్థులకు యూనిఫామ్స్, షూస్ పంపిణీ చేసిన ఎంఈఓ ప్రకాష్.
భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టిన చిన్నారులు.
ఇందిరమ్మ బీమా పథకం అమలుపై యాదగిరి సునీల్ రావు క్షేత్రస్థాయి పరిశీలన.
దివ్యాంగులకు స్వయం ప్రయాణ భాగ్యం కల్పించిన గంగుల.