సీఎంఆర్‌ఎఫ్‌ సాయంతో పేద కుటుంబాలకు ఊరట.

లబ్ధిదారులకు రూ.3.24 లక్షల ఆర్థిక సాయం చెక్కులు అందజేసిన మువ్వా.

సీఎంఆర్‌ఎఫ్‌ సాయంతో పేద కుటుంబాలకు ఊరట.

సత్తుపల్లి, నవంబరు 20 (తెలంగాణ ముచ్చట్లు):

నియోజకవర్గంలోని సత్తుపల్లి పట్టణంతో పాటు పలు గ్రామాలకు చెందిన ఐదుగురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్‌) ద్వారా మంజూరైన ఆర్థిక సాయం చెక్కులను మాజీ టీజీఐడీసీ చైర్మన్ మువ్వా విజయబాబు అందజేశారు. సత్తుపల్లి పట్టణంలోని అయ్యగారిపేటకు చెందిన తడికిముల్ల అప్పారావుకు రూ.22,500, సిద్ధారం గ్రామానికి చెందిన స్వర్గీయ నల్లంటి బసవయ్యకు రూ.45,000, అదే గ్రామానికి చెందిన బొడ్డు శ్రీనుకు రూ.20,000, సత్తుపల్లి సిద్ధారం రోడ్డుకు చెందిన లింగాల వెంకట రమేష్‌కు రూ.2 లక్షలు, బేతుపల్లి గ్రామానికి చెందిన ఓరుగంటి చందర్రావుకు రూ.36,500 చొప్పున ఆర్థిక సాయం అందింది. ఈ సందర్భంగా సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా ఆర్థిక సాయం అందేలా సహకరించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ టీజీఐడీసీ చైర్మన్ మువ్వా విజయబాబులకు లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, బేతుపల్లి సర్పంచ్ దొడ్డా రాజేంద్రప్రసాద్ (అమ్ములు), కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పొంగులేటి, మువ్వా అభిమానులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఇందిరమ్మ కుటుంబ బీమాతో ప్రతి ఇంటికి ఆర్థిక భద్రత. ఇందిరమ్మ కుటుంబ బీమాతో ప్రతి ఇంటికి ఆర్థిక భద్రత.
అర్హులైన కుటుంబాలకు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలు  ముల్కనూర్‌లో అవగాహన, అమలు చర్యలు భీమదేవరపల్లి, నవంబర్ 20 (తెలంగాణ ముచ్చట్లు): ప్రతి కుటుంబానికి ఆర్థిక...
నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే.
విద్యార్థులకు యూనిఫామ్స్, షూస్ పంపిణీ చేసిన ఎంఈఓ ప్రకాష్.
భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టిన చిన్నారులు.
ఇందిరమ్మ బీమా పథకం అమలుపై యాదగిరి సునీల్ రావు క్షేత్రస్థాయి పరిశీలన.
దివ్యాంగులకు స్వయం ప్రయాణ భాగ్యం కల్పించిన గంగుల.
ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా.