ఎస్.ఏ. సంపత్ కుమార్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఐఎన్‌టీయూసీ నాయకులు.

ఎస్.ఏ. సంపత్ కుమార్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఐఎన్‌టీయూసీ నాయకులు.

వనపర్తి,నవంబర్20(తెలంగాణ ముచ్చట్లు):

అలంపూర్ మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి ఎస్.ఏ. సంపత్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఐఎన్‌టీయూసీ తెలంగాణ ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ నాయకులు పాల్గొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర కార్యదర్శి దయ్యాల దాసు, వెల్తూరి అశోక్, గద్దల ప్రభాకర్ తదితరులు సంపత్ కుమార్‌ను కలిసి పూల బొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయనతో కలిసి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎస్.ఏ. సంపత్ కుమార్ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని, ప్రజా జీవితంలో మరిన్ని ఉన్నత స్థానాలను అధిరోహిస్తూ ప్రజలకు సేవలందించాలని ఆకాంక్షించారు. ఆయన భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఇందిరమ్మ జీవిత బీమా భరోసా పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి. ఇందిరమ్మ జీవిత బీమా భరోసా పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి.
*అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక రక్షణ.. పథకం అమలులో నిర్లక్ష్యం వద్దని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశం.* మానకొండూర్, నవంబర్ 20 (తెలంగాణ ముచ్చట్లు): పేద,...
ఇందిరమ్మ కుటుంబ బీమాతో ప్రతి ఇంటికి ఆర్థిక భద్రత.
నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే.
విద్యార్థులకు యూనిఫామ్స్, షూస్ పంపిణీ చేసిన ఎంఈఓ ప్రకాష్.
భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టిన చిన్నారులు.
ఇందిరమ్మ బీమా పథకం అమలుపై యాదగిరి సునీల్ రావు క్షేత్రస్థాయి పరిశీలన.
దివ్యాంగులకు స్వయం ప్రయాణ భాగ్యం కల్పించిన గంగుల.