ఇందిరమ్మ జీవిత బీమా భరోసా పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి.

ఇందిరమ్మ జీవిత బీమా భరోసా పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి.

*అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక రక్షణ.. పథకం అమలులో నిర్లక్ష్యం వద్దని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశం.*

మానకొండూర్, నవంబర్ 20 (తెలంగాణ ముచ్చట్లు):

పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకాన్ని మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం వెల్జీపూర్ గ్రామంలో ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ హోదాలో పాల్గొన్న ఆయన సంబంధిత ప్రభుత్వ, ఆర్థిక శాఖ అధికారులతో కలిసి పథకం అమలు ప్రక్రియను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అనుకోని పరిస్థితుల్లో కుటుంబ పెద్దను కోల్పోయిన నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు రూ.5 లక్షల జీవిత బీమా రక్షణతో ఈ పథకాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఈ పథకం ఎంతో అండగా నిలుస్తుందని, ప్రతి అర్హ కుటుంబం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

మానకొండూర్ నియోజకవర్గంలోని అర్హులైన ప్రతి కుటుంబానికి ఈ పథకం ప్రయోజనం అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. గ్రామస్థాయిలో ప్రజలకు పథకం నమోదు విధానం, అర్హతలు, లబ్ధి పొందే ప్రక్రియపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని తెలిపారు. పథకం అమలులో ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా, పేద కుటుంబాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సంబంధిత అధికారులకు, సర్పంచులకు ఆదేశాలు జారీ చేశారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు, ఆర్థిక శాఖ ప్రతినిధులు, స్థానిక సర్పంచులు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఇందిరమ్మ జీవిత బీమా భరోసా పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి. ఇందిరమ్మ జీవిత బీమా భరోసా పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి.
*అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక రక్షణ.. పథకం అమలులో నిర్లక్ష్యం వద్దని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశం.* మానకొండూర్, నవంబర్ 20 (తెలంగాణ ముచ్చట్లు): పేద,...
ఇందిరమ్మ కుటుంబ బీమాతో ప్రతి ఇంటికి ఆర్థిక భద్రత.
నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే.
విద్యార్థులకు యూనిఫామ్స్, షూస్ పంపిణీ చేసిన ఎంఈఓ ప్రకాష్.
భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టిన చిన్నారులు.
ఇందిరమ్మ బీమా పథకం అమలుపై యాదగిరి సునీల్ రావు క్షేత్రస్థాయి పరిశీలన.
దివ్యాంగులకు స్వయం ప్రయాణ భాగ్యం కల్పించిన గంగుల.